చిట్కాలు

Eyebrows : అమ్మాయిలు కచ్చితంగా పాటించాల్సిన ముఖ్యమైన ఐబ్రో మేకప్ టిప్స్..!

Eyebrows : అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది. ఇందు కోసం ఎన్నో రకాల సౌందర్య సాధనాలను వాడడం, బ్యూటీ పార్లర్‌లకు వెళ్లడం నేటి తరుణంలో ఎక్కువైంది. అయితే ప్రధానంగా ముఖం అందంగా కనిపించాలంటే ఆ భాగంలోని ప్రతి ప్రదేశానికి ఎంతో ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా కనుబొమ్మల (ఐబ్రోస్)ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కింద ఇచ్చిన పలు సూచనలు పాటిస్తే అమ్మాయిలు తమ ఐబ్రోస్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కనుబొమ్మల పొడవును ఎక్కువగా పెంచరాదు. ఏదైనా ఒక పాయింట్ ఆధారంగా కనుబొమ్మలను ఆర్చ్(వంకర)లాగా మలచకూడదు. ఇది ముఖానికి కోపోద్రిక్తమైన లుక్‌నిస్తుంది. కనుబొమ్మలు ఎప్పుడూ ఏదైనా ఒక ఫ్రేమ్‌లో ఇమిడిపోయే విధంగా చక్కని ఆకృతిని కలిగి ఉండాలి. కనుబొమ్మలు ఎక్కువగా హైలైట్ అయ్యేలా మేకప్ షేడ్స్, రంగులను వాడకూడదు. ఇవి డల్ లుక్‌నిస్తాయి. డార్క్ కలర్స్‌తో కనిపించే విధంగా కనుబొమ్మలను తీర్చిదిద్దకూడదు.

women must follow these eye brow tips

పలుచగా ఉన్న ప్రదేశాన్ని ఫిల్ చేయడం కోసం పెన్సిల్ మస్కరా లేదా బ్రో పౌడర్‌ను వాడాలి. సహజంగా ఆర్క్‌లు వచ్చేలా పెన్సిల్‌తో కనుబొమ్మలను తీర్చిదిద్దాలి. కనుబొమ్మలను తరచూ బ్రష్‌తో దువ్వినట్టు చేయాలి. ఇది కనుబొమ్మల వెంట్రుకలను మ‌రింత‌ పెరిగేలా చేస్తుంది. దీంతో కనుబొమ్మ‌లు చూసేందుకు ఎంతో అందంగా క‌నిపిస్తాయి. ఆక‌ర్ష‌ణీయ‌మైన లుక్ సొంత‌మ‌వుతుంది.

Admin

Recent Posts