Healthy Juice : ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. చిన్న చిన్న చిట్కాలని మనం ట్రై చేస్తే కచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది. పండ్లు తీసుకోవడం, పండ్ల రసాలు తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. అందుకే అందరూ పండ్లు, పండ్ల రసాలని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. పోషకాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. అయితే పండ్ల రసాలు, పండ్లు కొనుగోలు చేయాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాలి.
అయితే తక్కువ డబ్బుతో మనం ఎలా ఆరోగ్యంగా ఉండొచ్చు..?, రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చు..? అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని తీసుకోవడం వలన ఖర్చు తక్కువ, ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రసాన్ని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. పండ్ల రసాల లాగే మనం ప్రయోజనాలు పొందవచ్చు. 20 రూపాయల లోగా మనం ఈ రసాన్ని తయారు చేసుకోవచ్చు.
కీర దోసకాయలను ముక్కలుగా చేసుకుని టమాటాలని కూడా ముక్కలుగా చేసుకొని ఈ రెండింటినీ మిక్సీలో వేసి బాగా నలిగిన తర్వాత, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని బీట్‌రూట్ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం పుదీనా లేదంటే కొత్తిమీర రుచి కోసం వేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసుకోవచ్చు.
ఇలా వీటి అన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి. పిల్లలకి 150 ml వరకు పట్టించొచ్చు. ఇలా తీసుకోవడం వలన బ్లడ్ బాగా తయారవుతుంది. బాడీకి యాంటీ ఆక్సిడెంట్లు వంటివి అవసరం. కాబట్టి, ఈ జ్యూస్ ని మీరు ఇలా తయారు చేసుకొని తీసుకోండి. కాఫీ, టీ వంటివి కాకుండా మీరు ఈ జ్యూస్ ని తీసుకుంటే, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పోషకాలు బాగా అందుతాయి. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.