Kidneys | భోజనానికి ముందు ఈ ర‌సాన్ని తాగండి.. కిడ్నీలు క్లీన్ అయిపోతాయి..!

Kidneys | మ‌న‌లో చాలా మందికి కూర‌తో భోజ‌నం చేసిన త‌రువాత ర‌సంతో తినే అల‌వాటు ఉంటుంది. పిల్ల‌లు ర‌సంతో అన్నం తినేందుకు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. ర‌సం త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఖ‌ర్చు త‌క్కువ‌. చింత‌పండును నాన‌బెట్టిన నీళ్ల‌ల్లో ఉప్పు, కారం, ధ‌నియాలు, మిరియాలు వేసి తాళింపు చేసి చాలా మంది చేస్తుంటారు. ర‌సంలో నీరు మాత్ర‌మే అధికంగా ఉంటుంది, ఎటువంటి పోష‌కాలు ఉండ‌వు. ధ‌నియాలు, మిరియాలు వేయ‌డం వల్ల కొద్ది పాటి ఔష‌ధ గుణాలు ఉంటాయి. ర‌సంతో ఎక్కువ‌గా భోజ‌నం చేయ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలోకి నీరు ఎక్కువ‌గా పోతుంది. దీని వ‌ల్ల మ‌న జీర్ణాశ‌యంలో ఉత్ప‌త్తి అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ గాఢ‌త త‌గ్గుతుంది.

take tomato rasam before food to clean kidneys
Kidneys

మ‌నం తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ్వ‌డానికి, ఆహారం ద్వారా వ‌చ్చే క్రిముల‌ను న‌శింప‌జేయ‌డానికి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆహారం జీర్ణ‌మ‌వ్వ‌డానికి ఈ యాసిడ్ గాఢ‌త 0.8 పీహెచ్ నుండి 1.2 పీహెచ్ మ‌ధ్య ఉండాలి. ర‌సంతో ఎక్కువ‌గా భోజ‌నం చేయ‌డం వ‌ల్ల యాసిడ్ గాఢ‌త త‌గ్గి ఆహారం స‌రిగా జీర్ణ‌మ‌వ్వ‌దు, ఆహారం ద్వారా వ‌చ్చే క్రిములు కూడా న‌శించ‌వు. దీని వల్ల అజీర్తి, ఇత‌ర‌త్రా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కానీ మ‌న‌లో చాలా మంది ర‌సంతో భోజ‌నం చేయ‌డాన్ని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. ర‌సంతో భోజ‌నం చేయ‌నిదే వారికి భోజ‌నం చేసిన‌ట్టుగా ఉండ‌దు. అలాంటి వారు మామూలు ర‌సానికి బ‌దులుగా ట‌మాట‌ల‌తో చేసిన ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటారు.

ట‌మాట ర‌సంలో ధ‌నియాలు, మిరియాలు, వెల్లుల్లి వంటి వాటిని కూడా వేసుకోవ‌చ్చు. ఇవి వేయ‌డం వ‌ల్ల ట‌మాట ర‌సం రుచి పెర‌గడంతోపాటు వీటిల్లో ఉండే ఔష‌ధ గుణాలు శ‌రీరానికి ల‌భిస్తాయి. ఈ ట‌మాట ర‌సాన్ని భోజ‌నంతో తీసుకోవ‌డం కంటే భోజ‌నానికి అర గంట ముందు సూప్ లా తాగ‌డం వ‌ల్ల అధిక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ట‌మాట ర‌సాన్ని మ‌రిగించిన‌ప్పుడు నీరు త‌గ్గి, ట‌మాట‌ల‌ల్లో ఉండే ఔష‌ధ గుణాలు అన్నీ ర‌సంలోకి వ‌స్తాయి. ట‌మాట ర‌సాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల అజీర్తి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

ఊపిరితిత్తుల్లో క‌ఫం, శ్లేష్మం స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు టమాట ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అధిక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య ఉన్న వారు కూడా ట‌మాట ర‌సాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవ‌చ్చు. ట‌మాట ర‌సాన్ని మ‌రిగించిన‌ప్పుడు వీటిల్లో ఉండే ఆగ్జ‌లేట్స్ ఆవిరైపోతాయి. దీనివ‌ల్ల‌ ఈ రసాన్ని తాగినా కిడ్నీ స్టోన్స్ ఏర్ప‌డ‌వు. పైగా కిడ్నీలు క్లీన్ అవుతాయి. క‌నుక కిడ్నీ స్టోన్స్ ఉన్న‌వారు కూడా ఎలాంటి ఆందోళ‌న లేకుండా నిశ్చింత‌గా ఈ ర‌సాన్ని తాగ‌వ‌చ్చు. ఇక చింత‌పండుతో చేసే ర‌సానికి బ‌దులుగా ట‌మాటాల‌తో చేసిన ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్లనే ప్ర‌యోజ‌నాలు అధికంగా క‌లుగుతాయి.

Share
D

Recent Posts