ఈ వారంలో ఓటీటీల్లో ప్రేక్ష‌కుల‌ను సంద‌డి చేయ‌నున్న సినిమాలు ఇవే..!

ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌తి శుక్ర‌వారం ఓటీటీల్లో అద్భుత‌మైన సినిమాలు విడుద‌ల‌వుతూ ప్రేక్ష‌కుల‌ను సంద‌డి చేస్తున్నాయి. అందులో భాగంగానే ప్రేక్ష‌కులు కూడా ప్ర‌తి వారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వారం కూడా ప‌లు మూవీలు ఓటీటీల్లో విడుద‌ల కానున్నాయి. మ‌రి వాటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..!

list of movies releasing on OTT apps on April 1st

మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి న‌టించిన భీష్మ ప‌ర్వం అనే సినిమా ఈ వారం ఓటీటీలో విడుద‌ల కానుంది. ఏప్రిల్ 1వ తేదీన డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ఈ మూవీని స్ట్రీమ్ చేయ‌నున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ మూవీని తెర‌కెక్కించారు.

ప్ర‌భాస్‌, పూజా హెగ్డె జంటగా న‌టించిన రాధే శ్యామ్ మూవీ కూడా ఈ వారంలోనే ఓటీటీలో రానుంది. ఏప్రిల్ 1వ తేదీన ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయ‌నున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ ఫ్లాప్ టాక్‌ను సాధించింది. దీంతో చాలా త్వ‌ర‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.

శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా న‌టించిన ఆడ‌వాళ్లు మీకు జోహార్లు మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌లై నిరాశ ప‌రిచింది. ఈ సినిమా కూడా త్వ‌ర‌గానే ఓటీటీలో వ‌స్తోంది. ఏప్రిల్ 2వ తేదీన ఈ మూవీని సోనీ లివ్‌లో స్ట్రీమ్ చేయ‌నున్నారు.

మార్వెల్ సినిమాటిక్ యూనివ‌ర్స్ నుంచి వ‌స్తున్న మ‌రొక చిత్రం.. మూన్ నైట్‌. ఈ సినిమా మార్చి 30వ తేదీన డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో విడుద‌ల కానుంది.

దుల్క‌ర్ స‌ల్మాన్‌, అదితి రావు హైద‌రి, కాజ‌ల్ అగ‌ర్వాల్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం.. హే సినామిక‌. ఈ మూవీ కూడా థియేట‌ర్ల‌లో విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేదు. ఈ మూవీని ఏప్రిల్ 1వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేయ‌నున్నారు.

Editor

Recent Posts