హెల్త్ టిప్స్

Tamarind Seeds Powder : మోకాళ్ల‌లో గుజ్జును పెంచి.. కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించే చింత గింజ‌లు.. ఎలా వాడాలంటే..?

Tamarind Seeds Powder : చింతపండు లేని వంటిల్లు అసలు వంటిల్లే కాదు. రుచి కోసం చింతపండుతో మనం రకరకాల వంటలు చేసుకుని తింటూ ఉంటాం. చింతపండు దాని గుజ్జును ఉపయోగించుకుని అందులో ఉండే గింజలను మనం పారేస్తాం.. చింత గింజలతో కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, బాడీ పెయిన్స్ కు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు అని మీకు తెలుసా.. చింతపండు గింజలతో ఈ విధంగా చేస్తే పైన చెప్పుకున్న నొప్పులన్నీ మటుమాయమైపోతాయి.

ఆయుర్వేద వైద్య నిపుణులు కూడా కీళ్ళ నొప్పులతో బాధపడేవారికి చింత గింజలను సిఫార్సు చేస్తున్నారు. చింత గింజలను నీటిలో ఒక రోజు మొత్తం నానబెట్టి పైన తొక్క తీసి, ఎండలో ఆరబెట్టి వేగించి పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో వేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఇలా చేయడం కుదరదు అనుకున్నవారికి చింతగింజల పొడి కూడా మార్కెట్ లో లభ్యం అవుతుంది. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం అర టీస్పూన్ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి.

tamarind seeds can reduce knee pain how to use them

ఈ విధంగా మూడు నెలల పాటు చేయడం వలన కీళ్లలో గుజ్జు పెరిగి మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వంటి సమస్యలు తొలగిపోతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ గింజలలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాకుండా రక్తంలోని కొవ్వును కరిగిస్తుంది. తద్వారా గుండెపోటు సమస్యలు రాకుండా కాపాడుతుంది.

డయాబెటిస్ ఉన్నవారికి కూడా చింతపండు గింజల పొడి బాగా హెల్ప్ చేస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పరిమాణాన్ని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా ఈ పొడిలో ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చేయడమే కాకుండా జీర్ణ సంబంధ సమస్యల‌ను దరిచేరనివ్వదు. మలబద్దక సమస్యను నివారిస్తుంది.

చింత గింజ‌ల్లో మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్స్‌, ఎమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, ఫైబ‌ర్ వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ప్రతి రోజు అర టీస్పూన్ చింత గింజల పొడిని ఒక టీస్పూన్ తేనెలో కలిపి తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి బరువు తగ్గించటంలో సహాయపడుతుంది. క‌నుక చింత గింజ‌ల పొడిని ఉప‌యోగించ‌డం మ‌రిచిపోకండి.

Admin

Recent Posts