ఆధ్యాత్మికం

పెళ్లి తర్వాత మహిళలు నల్లపూసలు ఎందుకు ధరిస్తారో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లైన స్త్రీలు కొన్ని ప్రత్యేక ఆభరణాలను ధరిస్తారు. ముఖ్యంగా కాలికి మెట్టెలు, మెడలో తాళి, నల్లపూసలు వంటి ఆభరణాలను ధరిస్తారు. అయితే ఈ ఆభరణాలలో ఒక్కో ఆభరణానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. వీటిలో నల్లపూసలు ఎంతో ముఖ్యమైనవి. పూర్వకాలం మహిళలు నల్లపూసలను నల్ల మట్టితో తయారు చేయించేవారు. ఈ విధంగా తయారు చేయించిన నల్లపూసలు ధరించటం వల్ల మనలో ఉన్న వేడి మొత్తం అవి గ్రహిస్తాయని భావిస్తారు.

ప్రస్తుత కాలంలో ఈ విధమైనటువంటి సాంప్రదాయాలు తెలిసినవారు మట్టితో తయారుచేసిన నల్లపూసలను ధరిస్తున్నారు. ఇక ప్రస్తుత కాలంలో అత్తింటివారు మంగళసూత్రానికి నల్లపూసలు చుట్టి ఇస్తారు. వివాహానికి ముందు ఈ నల్లపూసలను వధూవరుల చేత నీలలోహిత గౌరీదేవికి పూజ చేయిస్తారు. ఈ విధంగా వధూవరులు పూజ చేయటం వల్ల వారిపై అమ్మవారి అనుగ్రహం కలిగి జీవితాంతం వారు సుఖసంతోషాలతో ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి.

why women wear nalla pusalu after marriage

అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజ చేయించిన నల్లపూసలు ధరించటం వల్ల వధూవరుల ఇద్దరికి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. అందుకోసమే పెళ్లైన మహిళలు అమ్మవారి వ్రతం చేసి నల్లపూసలను ధరించాలని చెబుతారు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు బంగారు దుకాణాలు నల్లపూసలను కొనుగోలు చేసి ధరించడం మనం చూస్తున్నాము.

Admin

Recent Posts