రోజూ ఉదయం మీరు చేసే ఈ తప్పులు మీ బరువును పెంచుతాయి.. చాలా మంది ఈ తప్పులు చేస్తారు..!!

బరువు తగ్గడం అనేది నిజానికి ఒక ప్రక్రియ. అనేక చిన్న చిన్న విషయాలను కూడా అందుకు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది రోజూ ఉదయాన్నే తప్పులు చేస్తుంటారు. అవి అలవాటుగా మారుతాయి. వాటిని రోజూ చేస్తారు. ఫలితంగా బరువు వేగంగా పెరుగుతారు. అయితే రోజూ ఉదయాన్నే చాలా మంది చేసే ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

these morning mistakes can increase your weight

చాలా మంది నిత్యం ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగుతారు. ఇది అధిక బరువు పెరిగేందుకు కారణం అవుతుంది. ఉదయాన్నే పరగడుపునే వాటిని తీసుకోరాదు. అందుకు బదులుగా గోరు వెచ్చని నీటిని తాగాలి. వీలైతే ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగాలి. దీంతో శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా మంది ప్యాక్‌ చేయబడిన ఫ్రూట్‌ జ్యూస్‌లను తాగుతారు. నిజానికి వాటిని తాగరాదు. అప్పుడే మన ఇంట్లో సహజ సిద్ధంగా తయారు చేసుకునే జ్యూస్‌నే తాగాలి. అందులో చక్కెర కలపకూడదు. దీంతో జ్యూస్‌ తాజాగా, సహజసిద్ధంగా ఉంటుంది. దాన్నే తాగాలి. ప్యాక్‌ చేయబడిన జ్యూస్‌లను తాగితే వాటిల్లో అధికంగా చక్కెర ఉంటుంది కనుక బరువు పెరుగుతారు. కాబట్టి ఉదయం ప్యాక్డ్‌ జ్యూస్‌లకు బదులుగా సహజసిద్ధమైన జ్యూస్‌లను తాగాల్సి ఉంటుంది.

చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేయడం మానేస్తారు. నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేయనివారు రోజులో ఇతర సమయాల్లో ఆహారాన్ని అధికంగా తీసుకుంటారని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది. దీంతో బరువు పెరుగుతారు. అలాగే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ మానేయడం వల్ల శరీర మెటబాలిజం తగ్గుతుంది. దీంతో కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు. కాబట్టి ఉదయం కచ్చితంగా ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి.

ఉదయం చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌ రూపంలో జంక్‌ ఫుడ్‌ తింటారు. అలా తినరాదు. సాంప్రదాయ అల్పాహారాలను తీసుకుంటే మంచిది. వాటితోపాటు గుడ్లు, పండ్లు, పండ్ల రసాలను తింటే శరీరానికి శక్తి, పోషకాలు అందుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. బరువు తగ్గడం సులభతరం అవుతుంది.

ఉదయం నిద్రలేచినా కొందరు బెడ్‌పై అలాగే పడుకుని ఉంటారు. ఫోన్‌తో కాలక్షేపం చేస్తారు. అలా బెడ్‌పై ఎక్కువ సేపు పడుకుని ఉంటే శరీరంలో శక్తి తగ్గుతుంది. రోజంతా అలసిపోయినట్లు అవుతారు. కనుక ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాటును కూడా మానేయాలి.

Admin

Recent Posts