మన ఆరోగ్యానికి పాలు ఎంతగానో దోహదం చేస్తాయన్న సంగతి తెలిసిందే. చిన్నారులే కాదు పెద్దలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం పాలు తాగాల్సి ఉంటుంది. మహిళలు, పురుషులు.. అందరూ పాలను తాగాలి. పాలలో కాల్షియం, అయోడిన్, పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్ డిలు సమృద్ధిగా ఉంటాయి. అయితే పాలతో కొన్ని ఆహారాలను మాత్రం కలిపి తీసుకోరాదు. తీసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
చేపలు, గుడ్లు, మాంసంలను పాలతోపాటు తీసుకోరాదు. తీసుకుంటే గ్యాస్, స్కిన్ అలర్జీలు వంటి సమస్యలు వస్తాయి. వీటి కాంబినేషన్ వల్ల జీర్ణవ్యవస్థపై భారం అధికంగా పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అయితే కనీసం 2 గంటల విరామంతో వీటిని తీసుకోవచ్చు.
అరటి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను పాలతో కలిపి తీసుకుంటే జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ఇది గ్యాస్ సమస్యను కలగజేస్తుంది. కాబట్టి ఈ ఫుడ్ కాంబినేషన్ కూడా మంచిది కాదు.
ఇవే కాకుండా చెర్రీలు, నారింజ, నిమ్మ పండ్లు, చింతకాయ, ఉసిరి, గ్రీన్ యాపిల్స్, పైనాపిల్, ఈస్ట్ కలిపిన పదార్థాలు, బీన్స్, ముల్లంగి వంటి పదార్థాలను కూడా పాలతో కలిపి తీసుకోరాదు. విరామం ఇచ్చి తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే పాలలో తేనె, బెల్లం, చక్కెర వంటివి కలుపుకోవడం ద్వారా పోషక విలువలు పెరుగుతాయి. దీని వల్ల మనకు పోషకాలు అందుతాయి. ఇక పాలను రాత్రి పూట తాగితేనే ఎక్కువ లాభాలు కలుగుతాయి.