దాదాపుగా చాలా మంది పెరుగును ఎంతో ఇష్టంగా తింటుంటారు. భోజనం చివర్లో మజ్జిగ లేదా పెరుగుతో తిననిదే చాలా మందికి భోజనం చేసిన ఫీలింగ్ కలగదు. పెరుగును అందరూ ఇష్టపడతారు. దీంతో మజ్జిగ కూడా చేసుకుని తాగుతుంటారు. పెరుగు చల్లని స్వభావం కలది. అంటే దీన్ని తింటే మన శరీరానికి చలువ చేస్తుంది. కనుకనే వేసవిలో చాలా మంది పెరుగు లేదా మజ్జిగ తీసుకుంటుంటారు. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం పెరుగును అసలు తినకూడదు. ఇక ఎవరెవరు పెరుగును తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారు పెరుగును అసలు తినకూడదు. పెరుగును తింటే నొప్పులు, వాపులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కనుక వీరు పెరుగుకు దూరంగా ఉండాలి. అలాగే ఆస్తమా సమస్య ఉన్నవారు కూడా పెరుగును తినకూడదు. తింటే ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఆస్తమా ఉన్న వారు పెరుగును తినకుండా ఉండడమే మంచిది. అలాగే వైట్ డిశ్చార్జి సమస్యతో బాధపడుతున్న మహిళలు కూడా పెరుగుకు దూరంగా ఉండాలని ఆయుర్వేదం చెబుతోంది.
అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు కూడా పెరుగును తినకూడదు. తింటే కొలెస్ట్రాల్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అయితే వెన్న తీసిన పెరుగును పలుచని మజ్జిగలా చేసుకుని తాగవచ్చు. ఇక పెరుగును తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇన్సులిన్ నిరోధకత తగ్గి షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి పైన తెలిపిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాకుండా ఇతరులు ఎవరైనా సరే నిరభ్యంతరంగా పెరుగును తినవచ్చు.