హెల్త్ టిప్స్

Heart Attack : వీరికి హార్ట్ ఎటాక్ వచ్చే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంది..!

Heart Attack : ఈ రోజుల్లో చాలామంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా, చాలా మంది గుండె సమస్యలు బారిన పడుతున్నారు. స్త్రీ, పురుషులు కూడా గుండె సమస్యలతో బాధపడడం, గుండెపోటు మరణాల రేటు కూడా పెరగడం వంటివి చూస్తున్నాం. అయితే, గుండె జబ్బులకి అనేక కార‌ణాలు ఉన్నాయి. అమెరికాలోనే ప్రతి ఏటా 6.5 మిలియన్ల మంది గుండె జబ్బులతో చనిపోతున్నారని, స్టడీ చెప్తోంది.

అయితే, నోటి సమస్యల ద్వారా గుండె జబ్బులు వస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. ఇక వివరాల్లోకి వెళితే, నోటి సమస్యల నుండి కూడా గుండె జబ్బులు వ్యాపిస్తాయని తెలుస్తోంది. శరీరంలోని అన్ని రకాల ఇన్ఫెక్షన్లు తీవ్రంగా మారితే, గుండెకి హాని కలుగుతుంది. నోటి సమస్యలు కూడా గుండె జబ్బులకు కారణం అవుతాయట. జాగ్రత్తగా ఉంటే, ఏ సమస్యా ఉండదు.

mostly these people will get heart attack

గుండె జబ్బుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. కరోనరీ వ్యాధులు, గుండె వైఫల్యం, స్ట్రోక్ ఇలా అనేక వ్యాధులు ఉన్నాయి. ఈ గుండె జబ్బుల‌కి జన్యు శాస్త్రం, జీవనశైలి కారణమని చెప్పొచ్చు. షుగర్ తో బాధపడేవాళ్లు, ఊబకాయం, అధిక రక్తపోటు ఉన్నవాళ్లు ముందు నుండి కూడా జాగ్రత్త పడాలి. ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిస్తే, మన ఆరోగ్యం బాగుంటుంది.

రోజూజు వ్యాయామం చేయడం, తగినంత సేపు విశ్రాంతి తీసుకోవడం, మంచి నిద్ర ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామాన్ని పాటించినట్లయితే గుండె సమస్యలు రాకుండా ఉండచ్చు. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుని గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. గుండె సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించొచ్చు. ఏవైనా పొరపాట్లు చేస్తే, అనవసరంగా ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి.

Admin

Recent Posts