Gym : ప్రస్తుత తరుణంలో హార్ట్ ఎటాక్‌లు అనేవి కామన అయిపోయాయి. ఒక మనిషి అప్పటి వరకు ఆరోగ్యంగానే ఉంటాడు. కానీ ఉన్నట్లుండి సడెన్‌గా కుప్పకూలి కింద పడిపోతాడు. హాస్పిటల్‌కు తీసుకెళ్లే లోపే చనిపోతున్నాడు. ఇలాంటి సంఘటనలు ప్రస్తుతం అనేకం జరుగుతున్నాయి. అన్ని సందర్భాల్లోనూ హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్‌లే సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఎక్కువగా జిమ్ చేస్తున్నవారికి.. శారీరక శ్రమ అధికంగా చేసేవారికి ఈ విధంగా జరుగుతుందని చెబుతున్నారు. కనుక వీరు కఠినమైన శ్రమ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యంగా జిమ్‌లలో గంటల తరబడి సాధన చేసే వారు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రాణాలే పోతాయి. హార్ట్ ఎటాక్‌లు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలను పాటించాలి. లేదంటే గుండె కండరాలపై ఒత్తిడి పడి హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇక జిమ్ చేసేవారు కింద తెలిపిన జాగ్రత్తలను పాటిస్తే.. హార్ట్ ఎటాక్ ల బారిన పడకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
జిమ్ చేసే ముందు కనీసం 5-10 నిమిషాల పాటు వార్మప్ చేయాలి. చేతులను, కాళ్లను, ఇతర శరీర భాగాలను సున్నితంగా ఆడిస్తూ.. అటు, ఇటు తిప్పుతూ వ్యాయామం చేసినట్లు నెమ్మదిగా చేయాలి. దీంతో శరీరంపై సడెన్‌గా ఒత్తిడి పడదు. శరీరం వ్యాయామం చేసేందుకు సిద్ధమవుతుంది. ఇక వ్యాయామాన్ని అదే పనిగా చేయరాదు. 20 నుంచి 30 నిమిషాల పాటు చేసి తరువాత 10 నుంచి 15 నిమిషాలు విరామం ఇవ్వాలి. ఆ తరువాత 20 నిమిషాలు చేయాలి. ఈ విధంగా మధ్యలో విరామం తీసుకుంటూ జిమ్ చేయాలి. దీంతో శరీరం.. ముఖ్యంగా గుండెపై ఒత్తిడి పడదు. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించవచ్చు. లేదంటే గుండెపై అధికంగా ఒత్తిడి పడి అది హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుందని.. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. వైద్యులు సూచిస్తున్నారు.