Food Mistake : మనలో చాలా మంది ఎటువంటి ఆహార పదార్థాలనైనా ఇంట్లోనే తయారు చేసుకుని మూడు పూటలా తింటుంటారు. ఇలాంటి వారు ఎప్పుడైనా ఏవైనా అనారోగ్యాల బారిన పడినప్పుడు.. నేను బయట దొరికే ఆహార పదార్థాలను, హోటల్స్ లో దొరికే ఆహార పదార్థాలను తిననప్పటికీ నాకే ఎందుకు వచ్చింది ఈ అనారోగ్యం.. అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. చాలా మంది బయట ఆహార పదార్థాలను తినే వారికే జబ్బులు వస్తాయి, ఇంట్లోనే ఆహార పదార్థాలను తయారు చేసుకుని తినే వారికి జబ్బులు రావు అని భావిస్తూ ఉంటారు. కానీ ఇది అంతా అపోహా మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు.
పూర్వ కాలంలో బయట ఆహార పదార్థాలకు, ఇంట్లో తయారు చేసుకునే ఆహార పదార్థాలకు చాలా వ్యత్యాసం ఉండేది. పూర్వ కాలంలో వంటలను సంప్రదాయ బద్దంగా తయారు చేసే వారు. ఎక్కువగా మసాలాలను, నూనెలను వాడే వారు కాదు. ఎక్కువగా అన్నం ఒకటి లేదా రెండు కూరలను తయారు చేసుకుని తినే వారు. పూర్వ కాలంలో హోటల్స్ లో తయారు చేసే ఆహార పదార్థాలలో మాత్రమే నూనెలను, మసాలాలను ఎక్కువగా వాడి రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసే వారు. హోటల్స్ లో దొరికే ఆహార పదార్థాలను ఇంట్లో తయారు చేసుకోవడం చాలా మందికి వచ్చేది కాదు. పూర్వ కాలంలో చాలా అరుదుగా హోటల్స్ కి వెళ్లి భోజనం చేసే వారు. కనుక పూర్వ కాలంలో ఇంట్లో భోజనం చేసే వారికి, బయట భోజనం చేసే వారికి ఆరోగ్య పరంగా వ్యత్యాసాలు వచ్చాయి.
కానీ ప్రస్తుత తరుణంలో వచ్చిన అనేక సాంకేతిక మార్పుల కారణంగా టీవీలలో, సెల్‌ఫోన్ లలో చూసి మనం ఇంట్లోనే నూనె, మసాలాలను వాడి హోటల్స్ లో దొరికే విధంగా రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉన్నాం. ప్రస్తుత తరుణంలో బయటి ఆహార పదార్థాలకు, ఇంట్లో తయారు చేసే ఆహార పదార్థాలకు వ్యత్యాసం లేకుండా పోయింది. అంతే కాకుండా హోటల్స్ లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతూ ఉంటారు. మసాలాలు కూడా బయట దొరికే ఆహార పదార్థాలలో అధికంగా ఉంటాయి. ఇంట్లో తయారు చేసుకునే ఆహార పదార్థాలలో కొన్ని వాటిల్లో నూనెలను, మసాలాలను అధికంగా, కొన్ని వాటిల్లో తక్కువగా వాడుతాం. ఇంట్లో తయారు చేసుకునే వంటల్లో నూనె, ఉప్పును తక్కువగా వాడినా కూడా నిల్వ పచ్చళ్లలో నూనెను అధికంగా వాడుతూ ఉంటాం.
కనుక ప్రస్తుత కాలంలో బయట దొరికే ఆహార పదార్థాలను తింటున్న వారు, మూడు పూటలా ఇంట్లోనే తయారు చేసుకుని తింటున్న వారు కూడా అనారోగ్యా ల బారిన పడుతున్నారు. ప్రతిరోజూ రుచికరంగా నూనెలను, మసాలాలను వాడి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటున్నాం. కనుక ప్రతి ఒక్కరూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. మనం వంట వండే విధానంలో మార్పు, ఆరోగ్యం కోసం మాత్రమే వండుకుని తినడం, జీవన విధానంలో మార్పులు తీసుకు రావడం వల్ల మాత్రమే మనం అనారోగ్యాల బారిన పడకుండా ఉంటామని నిఫుణులు చెబుతున్నారు.