Triphala Churnam : త్రిఫల చూర్ణం గురించి మనం సర్వసాధారణంగా వింటూ ఉంటాం. త్రిఫల చూర్ణం అంటే మూడు పండ్ల మిశ్రమంతో కలిపి చేసే చూర్ణం అని అర్ధం. ఇది ఒక సంప్రదాయ ఆయుర్వేద మందు. ఇది మూడు ఫలాల పొడి – ఆమలకీ, బిబ్బీతకీ, హరిటకీ కలయికతో తయారు చేయబడుతుంది. ఈ మూడు ఫలాలు ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందినవి కావడంతో త్రిఫల చూర్ణంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు జీర్ణక్రియ లక్షణాలకు ప్రసిద్ధి చెందినవి. ఇది జుట్టు, కళ్ళు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది. త్రిఫల తీసుకోవడం వల్ల వెంట్రుకలు దృఢంగా మారడంతో పాటు చర్మం మెరిసిపోతుంది. ఆయుర్వేద వైద్యుల అభిప్రాయం ప్రకారం, త్రిఫల కంటికి కూడా మేలు చేస్తుంది.
త్రిఫల చూర్ణాన్ని నిత్యం తీసుకుంటే ఇది శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను కూడా నివారంచడంలో ఇది బాగా పని చేస్తుంది. మలబద్ధం సమస్యలతో పాటు పేగులలో పేరుకుపోయిన టాక్సిన్‌ని బయటకు పంపుతుంది. త్రిఫల శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నివారణలో త్రిఫల ప్రభావవంతంగా ఉంటుందని చాలా మంది పరిశోధకులు చెబుతున్నారు. త్రిఫల తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద వైద్యులు స్పష్టం చేశారు.
ఇది ఆకలిని అదుపులో చేయడంలో ఉపయోగపడుంది. అధికంగా తినడాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది. త్రిఫల చూర్ణం రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది. చర్మ వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చర్మానికి ఒక టానిక్‌గా పనిచేస్తుంది. ముడతలు, చిన్న గీతలను తగ్గించడంలో సహాయపడుతుంది.ఇది కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, త్రిఫల చూర్ణం కండరాల నొప్పులు, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వాత వ్యాధి లక్షణాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. త్రిఫల చూర్ణాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు కానీ గర్భవతిగా ఉన్నవారు, పాలిచ్చే తల్లులు త్రిఫల చూర్ణాన్ని తీసుకోవాలి అని భావిస్తే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.