Heart Attack or Stroke : హైబీపీ ఉన్న‌వారికి గుండె పోటు ఎలా వ‌స్తుందో తెలుసా..? జాగ్ర‌త్త‌గా ఉండండి..!

Heart Attack or Stroke : అధిక రక్తపోటు, లేదా హైపర్‌టెన్షన్ అనే దాని గురించి ఈ రోజుల్లో మ‌నం ఎక్కువ‌గా వింటున్నాం. అధిక‌ర‌క్త‌పోటు స‌మ‌యంలో మన శరీరంలో రక్తం ప్రవహించే నాళాల్లో, ముఖ్యంగా ధమనుల్లో, రక్తం ఎక్కువ ఒత్తిడితో ప్రవహించడం జ‌రుగుతుంది. ఆ స‌మ‌యంలో అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్త‌డంతో పాటు కొన్ని సార్లు ప్రాణాపాయం కూడా తలెత్తే అవ‌కాశం ఉంది.అధిక రక్తపోటు గుండె వైఫల్యంతో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మ‌రి అధిక రక్తపోటు గుండె వైఫల్యానికి ఎలా దారితీస్తుందో ఇప్ప‌డు చూద్దాం. సాధార‌ణంగా అధిక రక్తపోటు హృదయానికి అత్యంత ప్రమాదకరం. ఇది హృదయంపై ఎక్కువ భారం మోపేలా చేస్తుంది. ఈ క్ర‌మంలో గుండె పెద్దదవ్వడం (హైపర్ట్రోఫి) జరుగుతుంది. ఇది గుండెపోటు (హార్ట్ ఎటాక్) మరియు గుండె వైఫల్యానికి (హార్ట్ ఫెయిల్యూర్) కూడా దారి తీసే అవ‌కాశం ఉంది.

అయితే అధిక రక్తపోటు కారణంగా అథెరోస్క్లెరోసిస్ అనే పరిస్థితి కలుగుతుంది, అంటే ధమనుల్లో కొవ్వు పదార్థాలు (ప్లాక్) పేరుకుపోడం జ‌రుగుతుంది. ఇది గుండె రక్త సరఫరాను తగ్గిస్తుంది, ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అధిక ర‌క్త‌పోటు వ‌ల‌న ధమనుల లోపలి పొర దెబ్బతింటుంది. దీని వలన అవి గట్టిగా మరియు ఇరుకైనవిగా మారతాయి. ఇది అథెరోస్క్లెరోసిస్ (ధమనులలో ఫలకాలు ఏర్పడటం), రక్తపోటును మరింత పెంచడం , రక్త ప్రవాహాన్నిత‌గ్గించ‌డం జ‌రుగుతుంది. అయితే అధిక రక్తపోటుకు ప్రమాద కారకాలు చూస్తే ముందుగా వయస్సుతో పాటు ప్రమాదం పెరుగుతుంది.ఊబకాయం వ‌ల‌న గుండెపై అదనపు ఒత్తిడి ప‌డుతుంది. పొగాకు వాడకం రక్తనాళాలను దెబ్బతీస్తుంది మరియు రక్తపోటును పెంచుతుంది. ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు ధమనుల‌ని దెబ్బతినడానికి దోహదం చేస్తాయి.

in which way high blood pressure causes Heart Attack or Stroke
Heart Attack or Stroke

దీర్ఘకాలిక ఒత్తిడి రక్తపోటు స్థాయిలను పెంచుతుంది. అధిక ఉప్పు మరియు తక్కువ పోషకాలు కలిగిన ఆహారాలు రక్తపోటుకు దోహదం చేస్తాయి. శారీరక శ్రమ లేకపోవడం కూడా అధిక ర‌క్త‌పోటుకి ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. హై బ్లడ్ ప్రెజర్ హార్ట్ ఫెయిల్యూర్ కి ఎలా దారి తీస్తుంది అంటే అధిక రక్తపోటు గుండె రక్తాన్ని పంప్ చేయడానికి కష్టపడి పని చేస్తుంది. పెరిగిన పనిభారం వ‌ల‌న గుండె కండరాలు చిక్కగా లేదా దృఢంగా మారవచ్చు. దీంతో కండ‌రాలు సమర్థవంతంగా సంకోచించలేవు, రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేసే గుండె సామర్థ్యం త‌గ్గిపోతుంది. మ‌రోవైపు పెరిగిన ఒత్తిడి వ‌ల‌న రక్త ప్రవాహాన్ని నియంత్రించడంలో తక్కువ ప్రభావవంతంగా పని చేస్తుంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD) అని పిలవబడే పరిస్థితి కూడా అధిక ర‌క్త‌పోటు వ‌ల‌న కలుగుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది మరియు గుండె వైఫల్యం మరింత తీవ్రమవుతుంది.

Share
Sam

Recent Posts