హెల్త్ టిప్స్

వారానికోసారైనా.. 1 K.M దూరం చెప్పుల్లేకుండా నడవడం అలవాటు చేసుకోండి. ఎందుకో తెలుసా?

దీనమ్మ…ఆధునిక కాలం.. మోడ్రన్ స్టైల్ పేరుతో…పడకగదిలో కూడా చెప్పులేసుకొని తిరుగాడుతున్న కాలం ఇది. ఉదయం బెడ్ మీదున్నుండి దిగింది మొదలు..మళ్లీ రాత్రి బెడ్ మీద పడుకునే వరకు కాళ్లను మాత్రం ఖాళీగా ఉంచే పరిస్థితే లేదు….వీలైతే స్లిప్పర్లు, లేకుంటే శాండిల్స్…కాకుంటే స్పోర్ట్స్ షూస్..ఇంకా అయితే ఫార్మల్ షూస్…ఇలా టైమ్ ను బట్టి ఏదో ఓ పాదరక్షలను బిగించి మరీ మన పాదాల్ని కప్పేస్తున్నాం… అయితే ఇక మీదట వారానికోసారైనా ఒక కిలోమీటర్ దూరం చెప్పుల్లేకుండా నడిచే ప్రయత్నం చేయండి…ఎందుకు? ఏమిటి? ఎలా అనే ప్రశ్నలు మీరు వేస్తే ….

ఇదిగో దానికి నా సమాధానం..

శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది. రక్తప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. పొత్తి కడుపుపై ఒత్తిడి కలిగి…. జీర్ణ క్రియ సక్రమంగా ఉంటుంది. నేల మీద చెప్పులు లేకుండా నడవడం ద్వారా…ఇసుక, చిన్న చిన్న రాళ్లు కాళ్లకు సుతిమెత్తగా కుచ్చుకోవడం ద్వారా….. మీ బిపి కంట్రోల్ అవుతుంది.

walking without footwear weekly once gives these benefits

ఏదో కొత్త స్పర్శను కాలి పాదాలు పొందడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. సహనం పెరుగుతుంది. మానవుని పాదాల్లో 72వేల నరాల కొనలు ఉంటాయి. ఎక్కువసేపు పాదరక్షలు వాడటం వల్ల సున్నితమైన ఈ నరాలు చచ్చుబడిపోతాయి. చెప్పుల్లేకుండా నడవడం వల్ల అవి యాక్టివ్ గా ఉంటాయ్. సో ఇక మీదట..పార్క్ లలో, బీచ్ లలో, ఆఫీస్ లలో, ఇంట్లో….చెప్పుల్లేకుండా నడిచే అలవాటును అలవర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి.

Admin

Recent Posts