Watermelon Seeds : మ‌ట‌న్‌, చికెన్‌ల‌కు బ‌దులుగా రూ.10 పెట్టి వీటిని కొని తెచ్చి తినండి.. కొండంత బ‌లం వ‌స్తుంది..!

Watermelon Seeds : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఆహారాన్ని తీసుకున్న‌ప్ప‌టికి చాలా మంది ఈస‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. నీర‌సం వ‌చ్చిందంటే చాలు చాలా మంది బ‌ల‌మైన ఆహారాన్ని తీసుకోవాల‌ని చెబుతూ ఉంటారు. బ‌ల‌మైన ఆహారం అన‌గానే మ‌న‌లో చాలా మందికి ముందుగా గుర్తుకు వ‌చ్చేది మాంసం, గుడ్లు, చేప‌లే. ఇవి బ‌ల‌మైన ఆహార‌మే కానీ నేటి త‌రుణంలో ఇవి చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. అంద‌రూ వీటిని కొనుగోలు చేసి తిన‌లేరు. పైగా ఇవి జీర్ణ‌మ‌వ్వ‌డానికి మ‌న బ‌లంలో స‌గం బ‌లాన్ని లాగేస్తూ ఉంటాయి. అయితే కేవ‌లం మాంస‌మే కాకుండా ప్ర‌కృతి ప్ర‌సాదించిన స‌హ‌జ సిద్ద‌మైన బ‌ల‌వర్ద‌క‌మైన ఆహారాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఇవి అంద‌రికి అందుబాటు ధ‌ర‌ల్లో ఉంటాయ‌ని వీటిని ఎవ‌రైనా కొనుగోలు చేసి తీసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అతి త‌క్కువ ఖ‌ర్చులో మ‌నం నీర‌సాన్ని త‌గ్గించుకుని బ‌లాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. నీర‌సాన్ని త‌గ్గించి శ‌రీరానికి చ‌క్క‌టి బ‌లాన్ని అందించే స‌హ‌జ సిద్ద ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీర‌సంతో బాధ‌ప‌డే వారు ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. వీటిని రాత్రంతా నాన‌బెట్టి తీసుకోవ‌డం వల్ల శ‌రీరానికి బ‌లం చేకూరుతుంది. అలాగే ప‌చ్చికొబ్బ‌రిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా నీర‌సం త‌గ్గుతుంది. ప‌చ్చికొబ్బ‌రిలో కొలెస్ట్రాల్ ఉండ‌దు. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల బ‌లంగా త‌యార‌వ్వ‌వ‌చ్చు. అదే విధంగా పుచ్చ‌గింజ‌ల ప‌ప్పు కూడా చాలా బ‌ల‌మైన ఆహార‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. మాంసం, జీడిపప్పు కంటే పుచ్చ‌గింజ‌ల ప‌ప్పు చాలా బ‌ల‌మైన ఆహార‌మ‌ని వారు చెబుతున్నారు.

Watermelon Seeds take these for many benefits
Watermelon Seeds

వీటిని నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల నీర‌సం త‌గ్గుతుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. అదే విధంగా పొద్దు తిరుగుడు ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. వీటిని నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల నీర‌సం త‌గ్గు ముఖం ప‌డుతుంది. ఇక గుమ్మ‌డి గింజ‌ల‌ప‌ప్పును కూడ నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల నీర‌సం త‌గ్గుతుంది. వీటితో పాటు నువ్వులను కూడా తీసుకోవ‌చ్చ‌ని ఇవి మాంసం కంటే 5 రెట్లు బ‌ల‌మైన ఆహార‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే నీర‌సంతో బాధ‌ప‌డే వారిలో జీర్ణ‌శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది. క‌నుక ఈ ప‌ప్పుల‌ను నాన‌బెట్టి తీసుకోవ‌డం వల్ల త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. వీటిని తీసుకున్న వారం నుండి ప‌దిరోజులల్లోనే మ‌న‌లో నీర‌సం త‌గ్గి మ‌నం ఉత్సాహంగా త‌యార‌వుతామ‌ని నిపుణులు చెబుతున్నారు. బ‌లం ప‌ట్టే టానిక్ లు, మాంసం, గుడ్ల‌కు బ‌దులుగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌లంగా త‌యార‌వవ‌చ్చని నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts