హెల్త్ టిప్స్

చ‌లికాలంలో రాత్రివేళ అర‌టిపండు తింటే ఏం అవుతుందో తెలుసా..?

అరటి పండ్లు హెల్తీ ఫ్రూట్ అంతే కాదు, హెవీ న్యూట్రీషియన్స్ కలి ఉన్న ఫ్రూట్ కూడా. అరటి పండు ద్వారా చాలా లాభాలుంటాని మనందరికీ తెలిసిందే. కొన్ని పండ్లు కొన్ని సీజన్స్ లలో మాత్రమే దొరుకుతాయి. కొన్ని పండ్లు సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి. చాలా తక్కువ పండ్లు మాత్రమే ప్రతి రోజు దొరుకుతాయి. వాటిలో అర‌టి పండ్లు కూడా ఒక‌టి.

అరటి పండులో విటమిన్స్,మినరల్స్, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉండటం వలన మనకు రోజంతా ఎనర్జీని ఇస్తుంది. తరచు అరటి పండ్లు తినడం వల్ల శరీరానికి చేరే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ వంటివి శరీరానికి క్యాన్సర్ సోకకుండా నిరోధిస్తుందట.

what happens if you eat banana during winter nights

అంతేకాకుండా బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా వుండేందుకు కూడా అరటి పండు మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇక అరటిపండులో వుండే ప్రొబయోటిక్ అనే బ్యాక్టీరియా ఒంట్లోని క్యాల్షియంని తీసుకుని ఎముకలని పటిష్టపర్చేందుకు సహకరిస్తుంది. ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ.. చలికాలంలో మాత్రం రాత్రి పూట అరటిపండ్లను తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే.. ఆయుర్వేద ప్రకారం.. చలికాలంలో రాత్రి పూట అరటి పండ్లను తినడం వల్ల మన శరీరంలో జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఆ సమస్యలు ఇది వరకే ఉన్నవారికైతే మరింత ఇబ్బంది కలుగుతుంది.

Admin

Recent Posts