వినోదం

సమరసింహరెడ్డి సినిమా కి బడ్జెట్, వచ్చిన కలెక్షన్స్ ఎంత అంటే ..!

బాలకృష్ణ చేసిన ఫ్యాక్షన్ చిత్రాల్లో సమరసింహారెడ్డి ఒకటి. ఈ మూవీ తర్వాతనే తెలుగు చిత్ర పరిశ్రమలు ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలైందని చెప్పవచ్చు.

అందువల్ల ఈ మూవీ ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్ గా మారింది. అప్పట్లో ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలై ఘనవిజయం సాధించింది.

వాస్తవానికి సమరసింహారెడ్డి సినిమా కథ ఆశామాషీగా తయారవ్వలేదు. రచయిత విజయేంద్ర ప్రసాద్ 30 కథలను చెప్పారట. చివరికి మూవీ కథను దర్శకుడు బి.గోపాల్ ఓకే చేశారట. దీంతో ఈ కథను బాలయ్యకు వినిపించగానే ఆయన ఇక మారు మాట్లాడకుండా వెంటనే ఓకే చెప్పేశారు. దీంతో సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఎట్టకేలకు ఈ మూవీ 1999వ సంవత్సరంలో జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

samara simha reddy movie budget and collections

సమరసింహారెడ్డి సినిమాకు రూ.6 కోట్ల వరకు ఖర్చు చేశారు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇలా బాలయ్య కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాగా ఈ మూవీ మూడు థియేటర్లలో ఏకంగా 227 రోజులు నడిచింది. అలాగే 29 కేంద్రాల్లో 175 రోజులు, 122 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శించబడింది. బాలకృష్ణను ఒక స్థాయిలో నిలబెట్టిన సినిమా సమరసింహారెడ్డి అని చెప్పవచ్చు. దీనికి పరుచూరి బ్రదర్స్ అందించిన డైలాగ్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఈ మూవీని ఇప్పటికీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంటారు.

Admin

Recent Posts