Chapati : ప్రస్తుత కాలంలో చాలా మంది ఉండాల్సిన బరువు కంటే వేగంగా బరువు పెరుగుతున్నారు. ఇలా అధికంగా బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. బరువు పెరడం వల్ల అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. దీంతో చాలా మంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వ్యాయామాలు చేయడంతో పాటు ఆహార నియమాలను పాటించడం, రాత్రి పూట అన్నాన్నికి బదులు చపాతీ తినడం వంటి అనేక పద్దతులను పాటిస్తూ ఉంటారు. అలాగే షుగర్ వ్యాధితో బాధపడే వారు కూడా రాత్రిపూట చపాతీని ఎక్కువగా తింటూ ఉంటారు.
కొందరు వైద్యులు కూడా మనకు రాత్రి పూట చపాతీలను తినమని సూచిస్తూ ఉంటారు. అయితే మనం తీసుకునే ఏ ఆహార పదార్థాలైనా వేడిగా తాజాగా ఉన్నప్పుడే మనం తినాలి. తాజాగా ఉన్న ఆహార పదార్థాలను తినడం వల్లే మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఆహార పదార్థాలను నిల్వ ఉంచే కొద్ది వాటిపై సూక్ష్మ క్రిములు చేరి అవి పాడైపోతాయి. అలాగే ఈ చపాతీలను అందరూ కూడా తయారు చేసుకున్న వెంటనే వేడిగా ఉన్నప్పుడే తింటూ ఉంటారు. అయితే చపాతీలను తయారు చేసుకున్న వెంటనే తినడం కంటే వాటిని తయారు చేసిన 12 గంటల తరువాత తినడం మంచిది. రాత్రి పూట మిగిలిపోయిన చపాతీలను ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
అధిక బరువుతో పాటు, షుగర్ వ్యాధితో బాధపడే వారు కూడా ఇలా 12 గంటల పాటు నిల్వ చేసిన చపాతీలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉదయం పూట చపాతీలను తినడం వల్ల గ్యాస్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. బీపీ కూడా అదుపులో ఉంటుంది. ముఖ్యంగా నిల్వ చపాతీలను తినడం వల్ల ఎనీమియా ( రక్తహీనత) సమస్య తగ్గుతుంది. రాత్రి పూట మిగిలిన చపాతీలను లేదా తయారు చేసుకుని నిల్వ ఉంచుకున్న చపాతీలను ఉదయం అల్పాహారంగా తీసుకోవాలి. దీంతో మన ఆరోగ్యం మరింత రెట్టింపు అవ్వడంతో పాటు త్వరగా బరువు కూడా తగ్గవచ్చు.