Sorakaya Pachadi : సొర‌కాయ ప‌చ్చ‌డిని ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు కూడా మొత్తం లాగించేస్తారు..

Sorakaya Pachadi : మ‌నం సొర‌కాయ‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సొర‌కాయ‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో సొర‌కాయ మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌నుక మ‌నం సొర‌కాయ‌ను త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాలి. సొర‌కాయ‌తో మ‌నం కూర‌ల‌నే కాకుండా ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. సొర‌కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ సొర‌కాయ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సొర‌కాయ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

సొర‌కాయ ముక్క‌లు – పావు కిలో, ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, ప‌చ్చిమిర్చి – 10 లేదా త‌గిన‌న్ని, త‌రిగిన ట‌మాటాలు – 2, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 6, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర – ఒక టీస్పూన్, చింత‌పండు – 5 గ్రా. లేదా రుచికి త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, ఎండుమిర్చి -2, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ప‌సుపు – పావు టీ స్పూన్.

Sorakaya Pachadi recipe in telugu very tasty best with rice
Sorakaya Pachadi

సొర‌కాయ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌ల్లీలు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత ధ‌నియాలు, ప‌చ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో సొర‌కాయ ముక్క‌లు వేసి 5 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై వేయించుకోవాలి. 5 నిమిషాల త‌రువాత ఇందులో ట‌మాట ముక్క‌లు, ప‌సుపు, చింత‌పండు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ట‌మాటాలు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. సొర‌కాయ ముక్క‌లు మ‌గ్గిన త‌రువాత ఇందులో కొత్తిమీర‌ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఒక జార్ ను తీసుకుని అందులో ముందుగా వేయించిన ప‌చ్చిమిర్చి వేసుకోవాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు, జీల‌క‌ర్ర వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి.

త‌రువాత వేయించిన సొర‌కాయ ముక్క‌ల‌ను వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా బ‌ర‌క‌గా ఉండేలా మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత దీనిని ప‌చ్చ‌డిలో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సొర‌కాయ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సొర‌కాయ‌తో కూర‌ల‌నే కాకుండా ఈ విధంగా ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు సొర‌కాయ వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యేజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts