హెల్త్ టిప్స్

Holy Basil Leaves : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 4 తుల‌సి ఆకుల‌ను న‌మిలి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Holy Basil Leaves : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే తుల‌సి మొక్క‌ను ఉప‌యోగిస్తున్నారు. హిందువులు తుల‌సి మొక్క‌ను అత్యంత ప‌విత్రంగా భావిస్తారు. మ‌హిళ‌లు రోజూ తుల‌సి కోట‌కు పూజ‌లు చేస్తుంటారు. తుల‌సి వరాల‌ను అనుగ్ర‌హిస్తుంద‌ని న‌మ్ముతారు. అయితే ఆయుర్వేదంలోనూ తుల‌సికి ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. దీని ద్వారా అనేక వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా తుల‌సి ఆకుల్లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇవి మ‌న‌కు క‌లిగే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తాయి. ఈ క్ర‌మంలోనే రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 4 తుల‌సి ఆకుల‌ను న‌మిలి తింటే.. ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

తుల‌సి ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ ఫంగ‌ల్, యాంటీ సెప్టిక్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల రోజూ తుల‌సి ఆకుల‌ను తింటే కీళ్ల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. ఫంగ‌స్‌, వైర‌స్‌, బాక్టీరియా ఇన్ఫెక్ష‌న్ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. చ‌ర్మ వ్యాధులు త‌గ్గుతాయి. గాయాలు, పుండ్లు త్వ‌ర‌గా మానుతాయి. తుల‌సి ఆకుల‌ను తీసుకోవ‌డం వల్ల ద‌గ్గు, జ‌లుబు, వికారం, జ్వ‌రం, స్త్రీల‌లో రుతు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. వ‌రుస‌గా ఒక వారం రోజుల పాటు తింటే త‌ప్ప‌క ఫ‌లితం క‌నిపిస్తుంది. ఇక షుగ‌ర్ ఉన్న‌వారికి కూడా తుల‌సి ఆకులు ఎంతో మేలు చేస్తాయి. షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి.

what happens if you eat daily 4 holy basil leaves

తుల‌సి ఆకుల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. అలాగే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ పటిష్టంగా మారుతుంది. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే ర‌క్తం శుద్ధి అవుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. తుల‌సి ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల కిడ్నీ స్టోన్లు క‌రిగిపోతాయి. దీంతోపాటు నొప్పి కూడా త‌గ్గుతుంది. మూత్రాశ‌య వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. తుల‌సి ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. తుల‌సి ఆకుల‌ను న‌ములుతుంటే ఎంత‌టి జ్వ‌రం అయినా స‌రే ఇట్టే త‌గ్గిపోతుంది. అలాగే సీజ‌న‌ల్ వ్యాధులు త‌గ్గుతాయి.

తుల‌సి ఆకుల‌లో చ‌ర్మానికి మేలు చేసే గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ ఆకుల‌ను తింటే మొటిమ‌లు, చ‌ర్మంపై దుర‌ద‌, ముడ‌త‌లు త‌గ్గిపోతాయి. దీంతో ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. తుల‌సి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. దీంతో ముడ‌త‌లు ప‌డ‌కుండా ఉంటుంది. వ‌య‌స్సు మీద ప‌డినా ముఖంలో వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించ‌వు. అలాగే తుల‌సి ఆకుల్లో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. దీంతో వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే కంటి జ‌బ్బులు రాకుండా అడ్డుకోవ‌చ్చు. అలాగే కంటి ఇన్ఫెక్ష‌న్లు కూడా త‌గ్గుతాయి. ఇలా తుల‌సి ఆకుల‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. కాబ‌ట్టి వీటిని తీసుకోవ‌డం మ‌రిచిపోకండి.

Admin

Recent Posts