హెల్త్ టిప్స్

Beer : బీర్ తాగితే శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుందా.. అస‌లు నిజం ఏమిటి..?

Beer : మ‌ద్యం ప్రియులు ఎండ‌ల్లో విస్కీ, బ్రాందీ, ర‌మ్‌, వోడ్కా క‌న్నా బీర్ తాగేందుకే ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. ఎందుకంటే చ‌ల్ల చ‌ల్ల‌ని బీర్ తాగితే శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంద‌ని వారు అనుకుంటారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది ? నిజంగానే బీర్ తాగితే శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుందా ? వేస‌విలో బీర్ తాగ‌వ‌చ్చా ? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బీర్ కూడా ఇత‌ర ఆల్క‌హాలిక్ డ్రింక్స్‌లాగే ఉంటుంది. కాక‌పోతే అందులో ఆల్కహాల్ త‌క్కువ‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలో చ‌ల్ల‌ని బీర్‌ను తాగితే అందులో ఉండే ఆల్క‌హాల్ వ‌ల్ల శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గుర‌వుతుంది. అంటే ఒంట్లో ఉన్న నీరు అంతా బ‌య‌ట‌కు పోతుంది. అయితే వేస‌విలో స‌హ‌జంగానే మ‌న శ‌ర‌రీంలో ఉండే నీరు డీహైడ్రేష‌న్ వ‌ల్ల బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. దీంతో మ‌న‌కు దాహం అవుతుంది. అదే ఈ కాలంలో ఇక బీర్ కాదు, ఏ ఇత‌ర ఆల్క‌హాలిక్ డ్రింక్ తాగినా స‌రే.. డీహైడ్రేష‌న్ మ‌రింత ఎక్కువవుతుంది. దీంతో మ‌న శ‌రీరంలో ఉండే నీరు ఇంకా త్వ‌ర‌గా బ‌య‌ట‌కు పోతుంది. అది మ‌న‌కు అస్స‌లు మంచిది కాదు. క‌నుక వేస‌విలో బీర్ కాదు, ఇత‌ర ఏ ఆల్క‌హాలిక్ డ్రింక్‌ను తాగ‌కుండా ఉండ‌డ‌మే బెట‌ర్‌.

will drinking beer cools body

ఇక చాలా మంది చ‌ల్ల‌ని నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది అనుకుంటారు. కానీ చ‌ల్ల‌ద‌నం కేవ‌లం మ‌న దాహం మాత్ర‌మే తీరుస్తుంది. శ‌రీరాన్ని చ‌ల్ల బ‌ర‌చ‌దు. కానీ జీర్ణాశ‌యంలో ఎలాంటి అల‌జ‌డి లేకుండా చేస్తుంది. అయితే శ‌రీరం చ‌ల్ల‌బ‌డాలంటే నీళ్ల‌కు బ‌దులుగా కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే ఇంకా మంచిది. వేస‌విలో మ‌న‌కు వేడి ఎక్కువ‌గా చేస్తుంది క‌నుక ఆ వేడి త‌గ్గాలంటే నీళ్లు స‌రిపోవు. కానీ కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే వేడి ఇట్టే దిగిపోతుంది. క‌నుక ఈ సీజ‌న్‌లో కొబ్బ‌రి నీళ్ల‌ను తాగాల్సి ఉంటుంది. కాబ‌ట్టి శ‌రీరంలో వేడి ఉన్న‌వారు రోజూ కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే ఎంతో మేలు జ‌రుగుతుంది. దీంతోపాటు పుచ్చ‌కాయ‌లు, త‌ర్బూజా వంటివి కూడా మేలు చేస్తాయి.

Admin

Recent Posts