బీరకాయలు మనకు ఏడాది పొడవునా అన్ని కాలాల్లోనూ లభిస్తాయి. బీరకాయలను సాధారణంగా చాలా మంది ఇష్టంగానే తింటారు. కొందరు తినరు. కానీ ఇప్పుడు చెప్పబోయే లాభాలు తెలిస్తే బీరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా తింటారు. బీరకాయలు అంతటి గొప్ప ప్రయోజనాలను మనకు అందిస్తాయి. ముఖ్యంగా వీటిని జ్యూస్ చేసి రోజూ ఒక కప్పు తాగితే మంచిది. దీంతో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇక బీరకాయల వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటి జ్యూస్‌ను తాగితే ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. అలాగే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. బీరకాయలను పేస్ట్‌లా చేసి కట్టు కడుతుంటే గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. వీటిల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు పుండ్లను త్వరగా మానేలా చేస్తాయి. బీరకాయలను తినడం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా దగ్గుతోపాటు జలుబు కూడా తగ్గుతుంది.
షుగర్ ఉన్నవారికి బీరకాయలు వరమనే చెప్పవచ్చు. రోజూ వీటిని తినలేని వారు రోజూ వీటి జ్యూస్‌ను పరగడుపునే తాగవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అధిక బరువు తగ్గుతారు. ఇక బీరకాయల జ్యూస్‌ను తాగితే విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది. దీంతో కంటి చూపు పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. బీరకాయలను తినడం వల్ల జీర్ణ సమస్యలు సైతం ఉండవు. ముఖ్యంగా గ్యాస్, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. కనుక బీరకాయ జ్యూస్‌ను రోజూ తాగడం మరిచిపోకండి.