హెల్త్ టిప్స్

Pregnancy : మ‌హిళ‌లు త్వ‌ర‌గా గ‌ర్భం దాల్చాలంటే వీటిని తినాలి..!

Pregnancy : పిల్ల‌ల్ని క‌నాల‌ని పెళ్లైన ప్ర‌తి స్త్రీకి ఉంటుంది. కానీ కొంద‌రికి మాత్రం ఆ భాగ్యం ద‌క్క‌దు. అందుకు అనేక కార‌ణాలు కూడా ఉంటాయి. అయితే సాధార‌ణ రుతు స‌మ‌స్య‌ల‌తో గ‌ర్భం దాల్చ‌డం ఆల‌స్య‌మ‌య్యే మ‌హిళ‌లకు మాత్రం ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ ఎంత‌గానో మేలు చేస్తాయి. వీటిని పాటిస్తే రుతు స‌మ‌స్య‌లు పోవ‌డంతోపాటు గ‌ర్భం త్వ‌ర‌గా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ‌న‌గ‌ల్లో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. మ‌హిళ‌ల్లో వ‌చ్చే రుతు సంబంధ స‌మ‌స్య‌లు పోవాలంటే శ‌న‌గ‌లు ఎక్కువ‌గా తినాలి. దీంతో రుతుక్ర‌మం స‌రిగ్గా అయ్యి గ‌ర్భం వ‌చ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశం ఉంటుంది.

దానిమ్మ పండ్ల‌ను మ‌హిళ‌లు నిత్యం తింటే దాంతో శ‌రీరంలో రక్తం బాగా పెరుగుతుంది. ఈ క్ర‌మంలో గ‌ర్భాశ‌యానికి కూడా ర‌క్తం బాగా అందుతుంది. త‌ద్వారా రుతు స‌మ‌స్య‌లు పోయి గ‌ర్భం వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఫోలిక్ యాసిడ్, ఐర‌న్ వంటి పోష‌కాలు ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో అవ‌స‌రం. వీటి వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా పెరుగుతుంది. పోష‌కాలు స‌రిగ్గా అందుతాయి. రుతు స‌మ‌స్య‌లు పోయి గ‌ర్భం వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లో మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. వారి ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌ను మెరుగ్గా ప‌నిచేసేలా చేస్తుంది. ఈ క్ర‌మంలో ప్రెగ్నెంట్ అయ్యేందుకు అవ‌కాశం కూడా ఉంటుంది.

women who want pregnancy must take these

ఐస్ క్రీంల‌లో ఉండే ప‌లు ర‌కాల పాల సంబంధ కొవ్వులు స్త్రీల‌లో గ‌ర్భాశ‌య ప‌నితీరును మెరుగు పరుస్తాయి. అంతేకాదు, ప్రెగ్నెన్సీ త్వ‌ర‌గా వ‌చ్చేందుకు ఉప‌యోగ‌ప‌డే హార్మోన్ల‌ను విడుద‌ల చేస్తాయి. ఐర‌న్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల గుమ్మడి కాయ విత్త‌నాల‌ను తింటే ర‌క్తం బాగా ప‌డుతుంది. దీంతో గ‌ర్భాశయానికి ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రిగి రుత స‌మ‌స్య‌లు పోతాయి. ప్రెగ్నెన్సీ సుల‌భ‌మ‌వుతుంది. స్త్రీల‌లోని ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌కు బ‌లం చేకూర్చే ప‌లు ర‌కాల కీల‌క పోష‌కాలు ప‌నీర్‌లో ఉంటాయి. ప్రోటీన్లు కూడా ఇందులో ఎక్కువే. ఇవి త్వ‌ర‌గా ప్రెగ్నెన్సీ వ‌చ్చేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఫోలిక్ యాసిడ్‌, ఐర‌న్‌, విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల బ్ర‌కోలిని తింటే స్త్రీల‌లో రుతు స‌మ‌స్య‌లు ఉండ‌వు. ఫ‌లితంగా గ‌ర్భం వ‌చ్చేందుకు చాన్సులు ఎక్కువ‌గా ఉంటాయి.

విట‌మిన్ ఇ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు బాదం ప‌ప్పులో ఉంటాయి. ఇవి సంతాన సాఫ‌ల్య‌త‌కు మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో అవ‌స‌రం. కారం ఎక్కువ‌గా ఉండే మిర‌ప‌కాయ‌ల‌ను తింటే గ‌ర్భాశ‌యానికి ర‌క్త స‌ర‌ఫ‌రా పెరుగుతుంద‌ట‌. దీంతో అండాలు స‌కాలంలో విడుద‌లై ప్రెగ్నెంట్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. స్త్రీల‌లో వ‌చ్చే రుతు సంబంధ స‌మ‌స్య‌ల‌ను పోగొట్టే స‌హ‌జ సిద్ధ‌మైన ఔష‌ధం అర‌టి పండ్లు. వీటిని తింటున్నా రుతు స‌మ‌స్య‌లు పోయి గర్భం వ‌చ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఈ పండ్ల‌ను తింటే మ‌హిళ‌లు త‌మ‌కున్న స‌మ‌స్య‌ల‌ను పోగొట్టుకోవ‌చ్చు. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయి.

Admin

Recent Posts