హెల్త్ టిప్స్

Chicken Soup : చ‌లికాలం.. వేడి వేడి చికెన్ సూప్‌.. తాగితే ఎన్నో లాభాలు..

Chicken Soup : చ‌లికాలం ఈ ఏడాది మ‌రింత ఎక్కువ‌గా ఉంది. ఇంకా డిసెంబ‌ర్ రాక‌ముందే చ‌లి చంపేస్తోంది. చ‌లిని త‌ట్టుకునేందుకు చాలా మంది అనేక మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు. స్వెట‌ర్లు, ఉన్ని దుస్తులు ధ‌రించ‌డం, వేడి ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం చేస్తున్నారు. అయితే చ‌లికాలంలో మ‌నం తీసుకునే ఆహారాల్లో కూడా ప‌లు మార్పులు చేసుకోవాలి. దీంతో శ‌రీరం వెచ్చ‌గా ఉంటుంది. ఇక శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచే ఆహారాల్లో చికెన్ సూప్ కూడా ఒక‌టి. దీన్ని చ‌లికాలంలో ఎక్కువ‌గా తీసుకోవాలి. దీంతో శ‌రీరం వెచ్చ‌గా ఉండ‌డ‌మే కాదు.. మ‌న‌కు పోష‌కాలు, శ‌క్తి రెండూ ల‌భిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఇక చికెన్ సూప్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ సూప్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోన్‌లెస్ చికెన్ – పావు కిలో, పాల‌కూర త‌రుగు – ఒక క‌ప్పు, క్యారెట్ త‌రుగు – పావు క‌ప్పు, బీన్స్ త‌రుగు – పావు క‌ప్పు, వెల్లుల్లి త‌రుగు – ఒక టీస్పూన్‌, ప‌చ్చి మిర్చి త‌రుగు – ఒక టీస్పూన్‌, కార్న్ ఫ్లోర్ – ఒక టీస్పూన్‌, నూనె – ఒక టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌, పంచ‌దార – ఒక టీస్పూన్‌, మిరియాల పొడి – చిటికెడు, టేస్టింగ్ సాల్ట్ – చిటికెడు, ఉల్లికాడ‌ల త‌రుగు – 2 టీస్పూన్లు.

wonderful health benefits of chicken soup in winter

చికెన్ సూప్‌ను త‌యారు చేసే విధానం..

ముందుగా ఒక పాత్ర‌లో చికెన్ మునిగేలా నీళ్లు పోసి ఉడికించి ప‌క్క‌న పెట్టుకోవాలి. స్ట‌వ్ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడ‌య్యాక క్యారెట్‌, బీన్స్‌, వెల్లుల్లి, ప‌చ్చి మిర్చి త‌రుగుల‌ను వేసి కొద్దిగా వేయించాలి. చికెన్‌ను, దాన్ని ఉడికించిన నీళ్ల‌ను, పంచ‌దార‌, ఉప్పు, పాల‌కూర త‌రుగు, మిరియాల పొడి, టేస్టింగ్ సాల్ట్, కార్న్ ఫ్లోర్‌, ఉల్లికాడ‌ల త‌రుగు వ‌రుస‌గా ఒక‌దాని త‌రువాత ఒక‌టి వేసి కొద్దిసేపు ఉడికించి దించేయాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన చికెన్ సూప్ రెడీ అవుతుంది. దీన్ని చిన్న బౌల్‌లోకి తీసుకుని అందులో పైన కాస్త కొత్తిమీర త‌రుగు వేసి అలంక‌రించి స‌ర్వ్ చేయాలి. గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడు తాగితేనే ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్య‌క‌ర‌మైన ప్రయోజ‌నాలు కూడా క‌లుగుతాయి.

Admin

Recent Posts