బ్రేక్‌ఫాస్ట్… లంచ్… డిన్నర్… ఇవి మూడూ మనకు రోజులో ముఖ్యమైన ఆహారాన్ని అందిస్తాయి. మన శరీరానికి అవసరమైన కీలక పోషకాలు, శక్తిని అందిస్తాయి. అయితే బ్రేక్ ఫాస్ట్, డిన్నర్‌ల సంగతి పక్కన పెడితే చాలా మంది లంచ్ తినే విషయంలో అశ్రద్ధ చేస్తున్నారు. దీని వల్ల ఎక్కువగా బరువు పెరుగుతారు. బరువు కచ్చితంగా తగ్గాలనుకునే వారు లంచ్ విషయంలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్, నైట్ డిన్నర్ టైముకే చేసినా లంచ్ విషయంలో మాత్రం ఆలస్యం చేస్తుంటారు. పని ఒత్తిడి లేదా ఇంకా ఇతర అనేక కారణాల వల్ల లంచ్ టైం దాటిపోయి తింటుంటారు. అయితే అలా చేయకూడదు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన టైముకు అనుగుణంగా లంచ్ చేయాల్సిందే. లేదంటే బరువు పెరుగుతారు.
అనేక మంది ఉద్యోగులు లంచ్‌ను ఆఫీసులోనో లేదా బయట ఎక్కడైనా చేస్తారు. అయితే ఎక్కడ లంచ్ చేసినా ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ అయితే బెటర్. లేదంటే క్యాలరీలు అధికంగా ఉండే ఆహారం తినేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్‌నే లంచ్‌లా తినాలి. పని ఒత్తిడి కారణంగా లంచ్‌ను చాలా మంది త్వరగా ముగిస్తారు. కానీ అలా వేగంగా ఆహారం తినడం మంచిది కాదు. అది ఒంటికి పట్టదు సరికదా జీర్ణం కూడా కాదు. దీంతో పోషకాలు, శక్తి అందకుండా పోతాయి. కనుక లంచ్ టైంలో కూడా ఆహారం నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోవాలి.
లంచ్ ను అస్సలు మానేయకూడదు. ఎందుకంటే ఎవరైనా ఆ టైములో పని బాగా చేస్తారు. కనుక వారికి శక్తి ఎక్కువ అవసరం అవుతుంది. అలాంటప్పుడు కార్బొహైడ్రేట్లు ఉన్న ఆహారం తినాలి. దీంతో శక్తి బాగా అందుతుంది. అంతే కానీ మధ్యాహ్నం భోజనాన్ని అస్సలు మానేయకూడదు. మధ్యాహ్నం తినే భోజనంతోపాటు కొద్దిగా ప్రోటీన్లు కూడా లభించేలా ఆహారం తీసుకోవడం బెటర్. గుడ్లు, చికెన్, మటన్, పప్పు వంటివి తినాలి. స్వీట్లు తినకూడదు. మధ్యాహ్నం భోజనంలో కచ్చితంగా 8 గ్రాముల ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. బీన్స్, చిక్కుళ్లు, కీర దోస వంటివి తింటే ఫైబర్ పుష్కలంగా అందుతుంది. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
లంచ్ లో కొవ్వు పదార్థాలను తినకపోవడమే బెటర్. కానీ… బాదంపప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటివి తినవచ్చు. దీంతో మన శరీరానికి మంచి కొలెస్ట్రాల్ అందుతుంది. దాంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తరువాత సుమారుగా 4, 5 గంటల తరువాత లంచ్ చేయడం ఉత్తమం. దీంతో రెండింటికీ మధ్య మంచి గ్యాప్ వస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.