Papaya : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లలో బొప్పాయి పండ్లు ఒకటి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో అవసరం. బొప్పాయి పండ్లు మనకు సీజన్లతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా లభిస్తాయి. బొప్పాయి పండ్లలో విటమిన్లు, ఫైబర్ మినరల్స్ ఉంటాయి. ఈ పండ్లలో ఉండే పోషకాలు అనేక వ్యాధులను తగ్గిస్తాయి. బొప్పాయి పండ్లను తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు.
బొప్పాయి పండ్లు మన జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలో ఉండే పోషకాలు మన శరీరానికి కావల్సిన పోషణను అందిస్తాయి. బొప్పాయి పండ్లను తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. హైబీపీ తగ్గుతుంది. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలకు బొప్పాయి పండ్లు పనిచేస్తాయి.
అయితే ఆయుర్వేద వైద్యులు చెబుతున్న ప్రకారం బొప్పాయి పండ్లను అధిక మొత్తంలో తినరాదు. తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. కనుక బొప్పాయి పండ్లను మోతాదులో మాత్రమే తినాలి. రోజుకు ఒక కప్పు మోతాదులో బొప్పాయి పండ్ల ముక్కలను తినవచ్చు. అంతకు మించితే సైడ్ ఎఫెక్ట్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇక బొప్పాయి పండ్లను పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా తినరాదు. ముఖ్యంగా గర్భిణీలు వీటిని అస్సలు తినరాదు తింటే గర్భాశయంపై ప్రభావం పడుతుంది. దీంతో అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కిడ్నీలు, లివర్, చర్మ వ్యాధులు ఉన్నవారు బొప్పాయి పండ్లను తినరాదు. తింటే అలర్జీలు, కిడ్నీ స్టోన్లు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి.
బొప్పాయి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండ్లు సహజసిద్ధమైన లాక్సేటివ్‌గా పనిచేస్తాయి. కనుక విరేచనాలు అవుతున్నవారు, కడుపు ఉబ్బరంగా ఉన్నవారు ఈ పండ్లను అస్సలు తినరాదు. అలాగే గుండె అసాధారణ రీతిలో కొట్టుకునే సమస్య ఉన్నవారు, షుగర్ లెవల్స్ మరీ తక్కువగా ఉండే వారు.. బొప్పాయి పండ్లను తినరాదు. లో షుగర్ సమస్య ఉన్నవారు వీటిని తింటే షుగర్ లెవల్స్ ఇంకా పడిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. కనుక లో షుగర్ ఉన్నవారు బొప్పాయి పండ్లను తినరాదు.