Kiara Advani : మేక‌ప్ లేకుండా బ‌య‌ట‌కు వ‌చ్చిన కియారా అద్వానీ.. వీడియో వైర‌ల్‌..!

Kiara Advani : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో క‌లిసి భ‌ర‌త్ అనే నేను సినిమాలో న‌టించిన కియారా అద్వానీ ఈ మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. త‌రువాత రామ్ చ‌ర‌ణ్ తేజ్ ప‌క్కన విన‌య విధేయ రామ‌లో మ‌రోమారు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఈమె రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి మ‌ళ్లీ ఇంకో సినిమాలో చేస్తోంది. దీనికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంకర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Kiara Advani came outside without make up video viral
Kiara Advani

ఇక కియారా అద్వానీ ఇటీవ‌లే ఓ మూవీ షూటింగ్ కోసం బ‌య‌ట‌కు వ‌చ్చింది. కానీ ఆ స‌మ‌యంలో ఆమె మేక‌ప్ వేసుకోలేదు. దీంతో ఆమెను ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌లేక‌పోయారు. అయితే కొంద‌రు అభిమానులు మాత్రం ఆమెను గుర్తుప‌ట్టి ఫొటోలు దిగేందుకు ముందుకు వ‌చ్చారు. దీంతో ఆమె కోప‌గించుకోకుండా ఓపిగ్గా వారితో ఫొటోలు దిగి అక్క‌డి నుంచి వెళ్లిపోయింది.

కాగా కియారా అద్వానీకి చెందిన ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈమెను మేక‌ప్ లేకుండా చూసి నెటిజన్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక ఈమె రామ్ చ‌ర‌ణ్‌తోపాటు ప‌లు ఇత‌ర సినిమాలు కూడా చేస్తోంది. భూల్ భుల‌య్యా 2, గోవిందా నామ్ మేరా, జుగ్ జుగ్ జీయో వంటి హిందీ సినిమాల్లో ఈమె న‌టిస్తోంది.

Editor

Recent Posts