Crack Knuckles : మన శరీరంలోని పలు భాగాలు కొన్ని సందర్భాల్లో విచిత్రమైన శబ్దాలు చేస్తుంటాయి. అయితే అవి సహజమే. కానీ చేతి వేళ్లకు మెటికలు విరిచినప్పుడు టప్ మనే శబ్దం వస్తుంది. నిజానికి ఇలా చేయడం అంటే చాలా మంది సరదాగా ఉంటుంది. చేతి వేళ్లకు మెటికలు విరిచినప్పుడు చేతి వేళ్లు ఎంతో ఫ్రీగా అయినట్లు హాయిగా అయినట్లు అనిపిస్తుంది. నొప్పి తగ్గినట్లు ఫీలవుతారు. అందుకనే చాలా మంది చేతి వేళ్లకు మెటికలు విరుస్తుంటారు. అయితే ఓ డాక్టర్ చెబుతున్న ప్రకారం.. చేతి వేళ్లకు మెటికలు విరవకూడదట. ఎందుకో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
చేతి కీళ్లలో గాలి నిండినప్పుడు మెటికలు విరిస్తే ఒక్కసారిగా ఆ గాలి పోతుంది. కనుకనే మనం మెటికలు విరిచినప్పుడు టప్ మనే శబ్దం వస్తుంది. అయితే ఇలా చేయొద్దని Dr Karl Kruszelnicki చెబుతున్నారు. చేతివేళ్లకు మెటికలు విరవడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా వేళ్లకు ఉండే గ్రిప్ దీర్ఘకాలంలో 75 శాతం వరకు పోతుందని అంటున్నారు. ఇలా గ్రిప్ పోతే చిన్నపాటి డబ్బాలకు ఉండే మూతలను కూడా తెరవలేని పరిస్థితి ఉంటుందని అంటున్నారు. అందుకని తరచూ మెటికలు విరిచే అలవాటు ఉన్నవారు దాన్ని వెంటనే మానుకోవాలని సూచించారు.
అయితే ఇలా మెటికలు విరవడం వల్ల ఆర్థరైటిస్ అనే కీళ్ల సమస్య వస్తుందని గతంలో కొందరు సైంటిస్టులు తేల్చి చెప్పారు. కానీ ఈ విషయాన్ని Dr Karl Kruszelnicki కొట్టి పారేశారు. మెటికలను విరవడం వల్ల ఆర్థరైటిస్ వస్తుందని అనడంలో అర్థం లేదని.. అది ఎంత మాత్రం జరగదని.. తాను కొంత మందిని చూశానని.. కనుక మెటికలు విరిస్తే ఆర్థరైటిస్ రాదని అన్నారు. కానీ తరచూ ఇలా చేసేవారు మాత్రం ఆ అలవాటును వెంటనే మానకపోతే దీర్ఘకాలంలో వారు తమ చేతి వేళ్ల గ్రిప్‌ను కోల్పోతారని.. కనుక మెటికలను తరచూ విరవకూడదని అంటున్నారు.