Vegetable Uthappam : వెజిట‌బుల్ ఊత‌ప్పం.. ఎంతో రుచిక‌రం.. ఇలా చేసుకుని తింటే ఎన్నో లాభాలు..!

Vegetable Uthappam : రోజూ మనం ఉద‌యం భిన్న ర‌కాల బ్రేక్ ఫాస్ట్‌ల‌ను చేస్తుంటాము. ఇడ్లీలు, దోశ‌లు, కిచ్‌డీ, చపాతీలు, ఉప్మా.. ఇలా భిన్న ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను త‌యారు చేసుకుని మనం రోజూ తింటుంటాము. అయితే వీటిలో ఊత‌ప్పం కూడా ఒక‌టి. దీన్ని సాధార‌ణంగా బ‌య‌ట హోట‌ల్స్ లేదా రోడ్డు ప‌క్క‌న టిఫిన్స్ చేసే చోట మ‌నం తింటుంటాం. ఇంట్లో దీన్ని ఎలా త‌యారు చేసుకోవాలో చాలా మందికి తెలియ‌దు. కానీ ఇది భ‌లే రుచిగా ఉంటుంది. ఇంట్లోనూ అంతే రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. కూర‌గాయ‌ల‌తో చేసే ఊత‌ప్పం చ‌క్క‌గా ఉంటుంది. దీంతో మ‌న‌కు శ‌క్తి, పోష‌కాలు రెండూ ల‌భిస్తాయి. అయితే ఊత‌ప్పం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. దాన్ని ఎలా త‌యారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

Vegetable Uthappam make it in this way for these health benefits
Vegetable Uthappam

వెజిటెబుల్ ఊత‌ప్పం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ర‌వ్వ – ఒక‌ క‌ప్పు, పుల్ల‌ని పెరుగు – పావు క‌ప్పు, ఉప్పు – రుచికి త‌గినంత‌, నీళ్ళు – స‌రిప‌డా, త‌రిగిన ఉల్లిపాయ‌లు – ఒక క‌ప్పు, త‌రిగిన క్యారెట్ – ఒక క‌ప్పు, త‌రిగిన క్యాప్సికం – ఒక కప్పు, స్వీట్ కార్న్ – ఒక క‌ప్పు, త‌రిగిన బీన్స్ – ఒక క‌ప్పు, చిల్లీ ఫ్లేక్స్ – స‌గం టీ స్పూన్‌, నూనె – 1 టీ స్పూన్‌, కొత్తిమీర – త‌గినంత‌.

వెజిటెబుల్ ఊత‌ప్పంను త‌యారు చేసే విధానం..

ఒక పాన్ తీసుకొని టీ స్పూన్ నూనె వేసి కాగాక త‌రిగిన కూర‌గాయ ముక్క‌లు , స్వీట్‌కార్న్, కొద్దిగా ఉప్పు, చిల్లీ ప్లేక్స్ వేసి ఒక నిమిషం వేయించి చ‌ల్లార్చాలి. ఒక గిన్నెలో ర‌వ్వ‌, పెరుగు, కొద్దిగా ఉప్పు వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌లుపుకోవాలి. ఇందులో వేయించి పెట్టిన కూర‌గాయ ముక్క‌లు, కొత్తిమీర వేసి బాగా క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని పెనం మీద కొద్దిగా నూనె వేసి ఊత‌ప్పంలా వేసుకొని 3 నిమిషాల త‌రువాత తీయాలి. దీంతో వెజిటెబుల్ ఊత‌ప్పం రెడీ అవుతుంది.

ఇలా త‌యారు చేసుకున్న వెజిటెబుల్ ఊత‌ప్పంను ప‌ల్లీలు లేదా కొబ్బ‌రి చ‌ట్నీల‌తో క‌లిపి తిన‌వ‌చ్చు. దీంతో రుచికి రుచి, పోష‌కాల‌కు పోష‌కాలు ల‌భిస్తాయి. ఈ ఊత‌ప్పంలో కూర‌గాయ‌ల‌ను అధికంగా ఉప‌యోగిస్తాము. క‌నుక మ‌న‌కు ప్రోటీన్స్‌, ఫైబ‌ర్‌, బి విట‌మిన్స్ అధికంగా ల‌భిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటాము. అనేక వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. ముఖ్యంగా బ‌రువు త‌గ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది.

Share
D

Recent Posts