హెల్త్ టిప్స్

Cool Drinks : ఈ విష‌యం తెలిస్తే ఇక‌పై ఎవ‌రూ కూల్ డ్రింక్‌ల‌ను తాగ‌రు..!

Cool Drinks : వేసవి కాలంలో చల్ల చల్లగా ఉంటాయని చెప్పి కొందరు కూల్‌ డ్రింక్స్‌ను అదే పనిగా తాగుతుంటారు. ఇక కొందరు కాలాలతో సంబంధం లేకుండా కూల్‌డ్రింక్స్‌ను ఎడా పెడా తాగుతుంటారు. నిజానికి అలా తాగడం ఒక హాబీ అని కొందరు అనుకుంటారు. ఇంకా కొందరు వాటిని తాగితే దాహం తీరి రిలాక్స్‌ అవుతామని అనుకుంటారు. కానీ అసలు కూల్‌ డ్రింక్స్‌ గురించిన నిజం తెలిస్తే వాటిని ఎవరైనా సరే.. ఇక జన్మలో తాగరు.. మరి ఆ నిజం ఏమిటో తెలుసా..

కూల్‌ డ్రింక్స్‌లో ఫాస్ఫారిక్‌ యాసిడ్‌ అనే ఓ క్రిస్టలైన్‌ లిక్విడ్‌ ఉంటుంది. నిజానికి ఇది కూల్‌ డ్రింక్‌కు యాసిడ్‌ ఫ్లేవర్‌ను ఇస్తుంది. అయితే ఇదే రసాయనాన్ని టాయిలెట్‌ క్లీనర్‌లలోనూ ఉపయోగిస్తారు. అవును, ఇది నిజమే. ఫాస్ఫారిక్‌ యాసిడ్‌ క్రిములను చంపడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అందుకనే దాన్ని టాయిలెట్‌ క్లీనర్లలో వాడుతారు. అయితే ఈ విషయం తెలియని చాలా మంది కూల్‌డ్రింక్‌లను అమృతంలా సేవిస్తుంటారు. కానీ నిజానికి అసలు ఎవరైనా సరే.. కూల్‌ డ్రింక్‌లను తాగకూడదు.

you will never drink cool drinks if you know this

ఫాస్ఫారిక్‌ యాసిడ్‌ వల్ల మనకు చర్మ, జీర్ణ సమస్యలు వస్తాయి. జీర్ణాశయంతోపాటు పేగుల లోపలి వైపు చర్మం డ్యామేజ్‌ అవుతుంది. అల్సర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే అసిడిటీ, గ్యాస్‌ సమస్యలు వస్తాయి. కనుక కూల్‌డ్రింక్‌లను తాగడం మాని చక్కగా కొబ్బరిబొండాలు లేదా చెరుకు రసం తాగడం ఉత్తమం. దాంతో వేసవి తాపం తీరుతుంది. డీ హైడ్రేషన్‌ బారి నుంచి తప్పించుకోవచ్చు.

Admin

Recent Posts