ఆరోగ్యం

వ‌ర్షం నీళ్ల‌ను తాగ‌వ‌చ్చా ? ఏమైనా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయా ?

వ‌ర్షం నీళ్ల‌ను తాగ‌వ‌చ్చా ? తాగ‌కూడ‌దా ? అని చాలా మందికి సందేహం ఉంటుంది. అయితే వ‌ర్షం నీళ్ల‌ను నిజానికి తాగ‌వ‌చ్చు. అవి ప్ర‌పంచంలోనే అత్యంత స్వ‌చ్ఛ‌మైన నీళ్లుగా గుర్తించ బ‌డ్డాయి. వ‌ర్షం నీళ్ల‌లో అనేక మిన‌ర‌ల్స్ ఉంటాయి. తాగునీటి స‌దుపాయం లేని చోట వ‌ర్షం నీళ్ల‌పై ఆధార‌ప‌డి చాలా మంది జీవిస్తున్నారు. అయితే వ‌ర్షం నీళ్ల‌ను తాగ‌వ‌చ్చు. కానీ ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో, ఎలాంటి కాలుష్యం లేని చోట నేరుగా సేక‌రించిన వ‌ర్షం నీళ్ల‌ను అయితే తాగ‌వ‌చ్చు. కానీ సిటీలు, ప‌ట్ట‌ణాల్లో కాలుష్యం ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక వ‌ర్షం నీళ్ల‌ను తాగ‌కూడ‌దు.

can we drink rain water what are the benefits

వ‌ర్షం నీళ్ల‌ను తాగ‌డం వల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వ‌ర్షం నీళ్లు డిస్టిల్ట్ వాట‌ర్‌, ఆర్‌వో వాట‌ర్ అంత స్వ‌చ్ఛంగా ఉంటాయి. ఆర్‌వో వాట‌ర్ పీహెచ్ కు స‌మానంగా వ‌ర్షం నీళ్ల పీహెచ్ స్థాయిలు ఉంటాయి. అందువ‌ల్ల వ‌ర్షం నీళ్లు ఆల్క‌లైన్ వాట‌ర్‌గా ప‌నిచేస్తాయి. ఇవి మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ఈ నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది.

వ‌ర్షం నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకోవ‌చ్చు. వ‌ర్షం నీళ్లు యాంటీ ఆక్సిడెంట్ల‌లా ప‌నిచేస్తాయి. దీని వ‌ల్ల ఫ్రీ ర్యాడిక‌ల్స్ నాశనం అవుతాయి. క‌ణాలు సుర‌క్షితంగా ఉంటాయి.

ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 2-3 టేబుల్ స్పూన్ల వ‌ర్షం నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో పీహెచ్ స్థాయిలు మెరుగు ప‌డ‌తాయి. దీంతో అసిడిటీ, అల్స‌ర్లు త‌గ్గుతాయి.

వ‌ర్షం నీళ్ల‌తో త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. దుమ్ము, ధూళి తొల‌గిపోతాయి. చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుతాయి.

వ‌ర్షం నీళ్ల‌తో బ‌ట్ట‌ల‌ను ఉత‌క‌డం వ‌ల్ల దుస్తుల‌కు స‌హ‌జ‌మైన రంగు వ‌స్తుంది. ఇలా వ‌ర్షం నీళ్ల‌ను ఉపయోగించుకోవ‌చ్చు.

అయితే వ‌ర్షం నీళ్ల‌ను సేక‌రించాక వాటిని బాగా మ‌రిగించి తాగితే మంచిది. దీంతో ఏమైనా సూక్ష్మ జీవులు ఉంటే న‌శిస్తాయి. ఇక కాలుష్య భ‌రితంగా ఉన్న ప్రాంతాల్లో వర్షం నీళ్ల‌ను సేక‌రించ‌రాదు. ప‌చ్చ‌ని ప్ర‌కృతి వాతావ‌ర‌ణంలో వాటిని సేక‌రించాలి. దీంతో కాలుష్య కార‌కాలు లేని స్వ‌చ్ఛ‌మైన వ‌ర్షం నీళ్ల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts