సోంపు గింజలను చాలా మంది భోజనం చేశాక తింటుంటారు. వీటిని తినడం వల్ల నోరు దుర్వాసన రాకుండా తాజాగా ఉంటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉండవు. అయితే సోంపు గింజలతో అధిక బరువును తగ్గించుకోవడం తేలికే. అందుకుగాను కింద తెలిపిన విధంగా సోంపు గింజల నీళ్లను తయారు చేసుకుని తాగాలి. మరి ఆ నీళ్లను ఎలా తయారు చేయాలంటే..
ఒక పాత్రలో ఒక లీటర్ నీటిని తీసుకుని అందులో 4 టీస్పూన్ల సోంపు గింజలను వేసి బాగా మరిగించాలి. 5 నిమిషాల పాటు సిమ్‌లో ఉంచి మరిగించాక స్టవ్ మీద నుంచి దించి మూత పెట్టి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఆ నీటిని వడబోయాలి. దాన్ని ఒక కప్పు మోతాదులో రోజుకు 4 సార్లు తాగాలి. దీంతో బరువును తగ్గించుకోవచ్చు. అలాగే ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
సోంపు గింజల నీళ్లను తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గ్యాస్, అజీర్ణం, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
సోంపు గింజల నీటిని తాగడం వల్ల మెటబాలిజం మెరుగు పడుతుంది. బరువు నియంత్రణలో ఉండేందుకు ఇది సహాయ పడుతుంది.