Apple Beetroot Juice : ఈ జ్యూస్‌ను వారానికి ఒక్క‌సారి తాగితే చాలు.. ర‌క్తం మొత్తం శుద్ధి అవుతుంది..!

Apple Beetroot Juice : మ‌న శ‌రీరంలో ర‌క్తం ఎంతో ముఖ్య పాత్ర‌ను పోషిస్తుంది. ఇది మ‌నం తినే ఆహారాల్లోని పోష‌కాల‌ను, శ‌క్తిని, మ‌నం పీల్చే ఆక్సిజ‌న్‌ను శ‌రీరంలోని అన్ని భాగాల‌కు, క‌ణాల‌కు చేర‌వేస్తుంది. దీంతో మ‌న శ‌రీరంలో అన్ని అవ‌య‌వాలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే రోజూ మ‌నం తీసుకునే ద్ర‌వాలు, తినే ఆహారాల‌తోపాటు వివిధ ర‌కాల కార‌ణాల వ‌ల్ల మ‌న శ‌రీరంలోని ర‌క్తంలో వ్య‌ర్థాలు పేరుకుపోతుంటాయి. అందువ‌ల్ల ఎప్ప‌టిక‌ప్పుడు ఆ వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించాలి. లేదంటే మ‌నం వ్యాధుల బారిన ప‌డ‌తాం. అయితే ర‌క్తాన్ని శుద్ధి చేసుకోవాలంటే.. ఏం చేయాలి ? అని ఆలోచించకండి.. ఎందుకంటే మ‌న‌కు అందుబాటులో ఉన్న ప‌దార్థాల‌తోనే ఆ ప‌నిని సులభంగా చేయ‌వ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

Apple Beetroot Juice can detox your body and purify blood
Apple Beetroot Juice

ర‌క్తాన్ని శుద్ధి చేసి శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రిచేందుకు బీట్ రూట్, యాపిల్ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి. ఒక బీట్ రూట్‌, ఒక యాపిల్‌ను తీసుకుని శుభ్రంగా కడిగి ముక్క‌లు చేయాలి. అలాగే చిన్న అల్లం ముక్క‌ను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటిని మిక్సీలో వేసి జ్యూస్‌లా ప‌ట్టుకోవాలి. అనంత‌రం అందులో కాస్త నిమ్మ‌ర‌సం క‌లిపి తాగేయాలి. ఈ జ్యూస్‌ను ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాల్సి ఉంటుంది.

పైన తెలిపిన విధంగా త‌యారు చేసుకున్న జ్యూస్‌ను ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తాగాలి. త‌రువాత 30 నిమిషాల వ‌ర‌కు ఏమీ తీసుకోరాదు. ఇలా ప్ర‌తి వారానికి ఒక రోజు ఈ జ్యూస్‌ను తాగాలి. దీంతో ఎంతో మేలు జ‌రుగుతుంది. ముఖ్యంగా ర‌క్తం శుద్ధి అవుతుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ లెవల్స్ త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ మెరుగ్గా ప‌నిచేస్తుంది. అధిక బ‌రువు కూడా త‌గ్గుతారు.

Share
Admin

Recent Posts