Body Cleaning : శ‌రీరం మొత్తం క‌డిగేసిన‌ట్లు లోప‌లంతా క్లీన్ అవ్వాలంటే.. వ్య‌ర్థాలు, విష ప‌దార్థాల‌ను ఇలా బ‌య‌ట‌కు పంపండి..!

Body Cleaning : మనం నిత్యం పాటించే జీవనశైలితోపాటు రోజూ మనం తీసుకునే ఆహారాలు, తాగే ద్రవాల వల్ల మన శరీరంలో వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. అయితే మలమూత్రాల ద్వారా కొంత వరకు వ్యర్థాలు బయటకుపోతాయి. కానీ కొన్ని మొండి వ్యర్థాలు, విష పదార్థాలు మాత్రం శరీరంలో అలాగే పేరుకుపోతాయి. అవి బయటకు రావు. చివరకు అవే మనకు వ్యాధులను కలగజేస్తాయి. కనుక అలాంటి వ్యర్థాలు, విష పదార్థాలను రోజూ తొలగించుకోవాలి.

Body Cleaning follow these natural remedies to clean and detox your body

మన శరీరంలో పేరుకుపోయే విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపేందుకు కింద తెలిపిన డిటాక్స్‌ డ్రింక్స్‌ పనిచేస్తాయి. నిజానికి ఇవి సహజసిద్ధమైన పదార్థాలతో చేసినవే. వీటిని తయారు చేసేందుకు పెద్దగా శ్రమించాల్సిన పని కూడా లేదు. సులభంగానే వీటిని తయారు చేసుకోవచ్చు. వీటిని రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగాలి. దీంతో శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా క్లీన్‌ అవుతుంది. మరి ఆ డిటాక్స్‌ డ్రింక్స్‌ ఏమిటంటే..

1. గోధుమ గడ్డి జ్యూస్‌ – గోధుమ గడ్డిని సులభంగా మన ఇంట్లోనే పెంచుకోవచ్చు. గోధుమలను నీటిలో నానబెట్టి మొలకెత్తించాలి. తరువాత వాటిని ఒక ట్రేలో మట్టి తీసుకుని అందులో నాటాలి. కొన్ని రోజుల తరువాత మొలకలు చిన్న చిన్న మొక్కలుగా ఏర్పడతాయి. వాటిని కోసి జ్యూస్‌లా చేసుకుని ఏ రోజుకారోజు సహజసిద్ధంగా తాజాగా తాగవచ్చు. గోధుమగడ్డి జ్యూస్‌ను రోజూ పరగడుపునే తాగడం వల్ల శరీరం మొత్తం అంతర్గతంగా క్లీన్‌ అవుతుంది. శరీరంలో ఉండే విష పదార్థాలు, వ్యర్థాలు బయటకు పోతాయి. అలాగే గోధుమ గడ్డిలో ఉండే పోషకాలు మనకు లభిస్తాయి. దీని వల్ల రెండు విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. వ్యర్థాలు బయటకుపోవడంతోపాటు వ్యాధులను రాకుండా చూసుకోవచ్చు.

2. బీట్‌రూట్‌ – బీట్‌రూట్‌ జ్యూస్‌ను కూడా రోజూ ఒక కప్పు మోతాదులో తాగడం వల్ల శరీరం క్లీన్‌ అవుతుంది. రక్తం బాగా తయారవుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

3. గ్రీన్‌ టీ – రోజుకు రెండు కప్పుల గ్రీన్‌ టీని తాగడం వల్ల కూడా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపవచ్చు. ముఖ్యంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.

4. కొబ్బరినీళ్లు – కొబ్బరి నీళ్లు కూడా మంచి డిటాక్స్‌ డ్రింక్‌లా పనిచేస్తాయి. ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్‌ కొబ్బరినీళ్లను తాగితే శరీరం అంతా కడిగేసినట్లు క్లీన్‌ అవుతుంది. దీంతో వ్యర్థాలు బయటకు పోతాయి.

5. నిమ్మకాయ నీళ్లు – ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి కూడా తాగవచ్చు. ఇలా చేసినా శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలను బయటకు పంపవచ్చు. దీంతో వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు.

6. యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ – యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ శరీరాన్ని శుభ్రం చేసేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్‌ యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ కలిపి రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగాలి. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. అయితే గ్యాస్‌ ట్రబుల్ సమస్య ఉన్నవారు యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను తీసుకోరాదు. లేదంటే సమస్య మరింత ఎక్కువయ్యేందుకు అవకాశాలు ఉంటాయి.

ఈ విధంగా పైన తెలిపిన వాటిల్లో దేన్నయినా రోజూ తాగుతూ ఉంటే శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు పోయి శరీరం అంతర్గతంగా మొత్తం శుభ్రమవుతుంది. వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Editor

Recent Posts