Ridge Gourd : మనకు సులభంగా అందుబాటులో ఉన్న కూరగాయల్లో.. బీరకాయ ఒకటి. దీన్ని చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ ఇందులో పోషక విలువలు, ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. మార్కెట్‌లో మనకు రెండు రకాల బీరకాయలు లభిస్తున్నాయి. కొన్నింటి పైభాగం మృదువుగా ఉంటుంది. కొన్నింటి పైభాగం గరుకుగా ఉంటుంది. గరుకుగా ఉన్న పైభాగం కలిగిన బీరకాయలే మనకు ఎక్కువగా లభిస్తుంటాయి. దీంతో ఆ గరుకుదనాన్ని తొలగించి.. బీరకాయను కట్ చేసి కూరగా వండుకుంటుంటారు. కొందరు శనగపప్పు లేదా కోడిగుడ్లతో దీన్ని వండుతారు. కొందరు పప్పుగా వండుకుంటారు. అయితే ఎలా వండుకుని తిన్నా సరే బీరకాయల వల్ల కలిగే ప్రయోజనాలు బోలెడు అని చెప్పవచ్చు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. బీరకాయలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. నీరు ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఎ, సి, ఐరన్, మెగ్నిషియం, విటమిన్ బి6 సమృద్ధిగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, ఆల్కలాయిడ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. దీంతో శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి.
2. బీరకాయల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. దీని వల్ల కీళ్ల నొప్పులు, ఇతర నొప్పులు, వాపులు ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
3. బీరకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీని వల్ల షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. రోజూ ఉదయాన్నే పరగడుపునే కప్పు బీరకాయ జ్యూస్‌ను తాగుతుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
4. బీరకాయల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. వయస్సు మీద పడ్డాక కంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. కళ్లలో శుక్లాలు రావు. చూపు స్పష్టంగా ఉంటుంది.
5. బీరకాయల్లో నీరు, ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల బీరకాయ జ్యూస్‌ను తాగుతుంటే మలబద్దకం, గ్యాస్ తగ్గిపోతాయి. అజీర్ణ సమస్య నుంచి బయట పడవచ్చు.
6. అధిక బరువు తగ్గాలనుకునే వారికి బీరకాయ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది శరీర మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. దీంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. కనుక రోజూ బీరకాయ జ్యూస్‌ను తాగాలి.
బీరకాయను రోజూ తినలేమని అనుకునేవారు రోజూ ఉదయాన్నే కప్పు మోతాదులో జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి కూడా తీసుకోవచ్చు. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.