Cucumber Drink : ఎండాకాలంలో సహజంగానే ఎవరైనా సరే శరీరాన్ని చల్లబరుచుకునే మార్గాలను అనుసరిస్తుంటారు. అందులో భాగంగానే చల్లని పానీయాలను తాగుతుంటారు. కొబ్బరినీళ్లను సేవిస్తుంటారు.ఇంకా ఎన్నో పద్ధతులను వేసవిలో పాటిస్తుంటారు. దీంతోవేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతుంటారు. అయితే ఈ సీజన్‌లో అధికంగా లభించే కీరదోసతో ఓ డ్రింక్ తయారు చేసుకుని తాగితే దాంతో శరీరం త్వరగా చల్లబడుతుంది. పైగా ఎండ దెబ్బ బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు. దీంతోపాటు పలు ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
కీరదోస ఒకటి తీసుకుని దాన్ని బాగా కడిగి పొట్టుతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అలాగే కొత్తిమీర, పుదీనా ఆకులను కొన్ని తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. దీంతోపాటు కొన్ని తులసి ఆకులను కూడా తీసుకోవాలి. ఇక అన్ని పదార్థాలను కలిపి మిక్సీలో వేసి జ్యూస్ తయారు చేయాలి. చివరకు అందులో కాస్తంత నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి కలపాలి. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యాక తాగాలి. దీంతో కీరదోస డ్రింక్ ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
కీరదోస డ్రింక్ ను ఇలా తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలోని వేడి దెబ్బకు పోతుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. ఎండలో వెళితే ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. అలాగే కీరదోస అధిక బరువును తగ్గించగలదు. డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. హైబీపీని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. దీంతో మలబద్దకం, గ్యాస్ సమస్యలు ఉండవు. శరీరం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. వేసవి నుంచి రక్షణ లభిస్తుంది. ఇలా కీరదోస డ్రింక్‌ను రోజూ తయారు చేసుకుని మధ్యాహ్నం సమయంలో తాగితే మంచిది.