Asafoetida : వంట ఇంటి ఔష‌ధం ఇంగువ‌తో.. గృహ చికిత్స‌లు..!

Asafoetida : ఇంగువను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే ఉప‌యోగిస్తున్నారు. దీన్ని వంట ఇంటి ప‌దార్థంగా వాడుతున్నారు. ఇంగువ‌ను కూర‌ల్లో వేస్తే చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే ఆయుర్వేద ప్ర‌కారం ఇంగువ‌లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీంతో అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇంగువ‌ను ఉప‌యోగించి ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

home remedies using Hing or Asafoetida
Asafoetida

1. ఒక క‌ప్పు నీళ్ల‌లో అర టీస్పూన్ ఇంగువ పొడిని వేసి క‌లిపి తాగితే ఎంత‌టి అజీర్తి స‌మ‌స్య అయినా ఇట్టే త‌గ్గుతుంది. దీన్ని రాత్రి పూట నిద్ర‌కు ముందు తాగితే మ‌రుస‌టి రోజు సుఖ విరేచ‌నం అవుతుంది. ఇలా రోజూ చేస్తుంటే మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. గ్యాస్, క‌డుపు నొప్పి, క‌డుపులో మంట వంటి జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

2. గ్యాస్ స‌మ‌స్య బాగా ఉన్న‌వారు చిటికెడు ఇంగువ పొడిని ఒక గ్లాస్ మజ్జిగ‌లో క‌లిపి తాగాలి. భోజ‌నం త‌రువాత ఇలా చేయాలి. దీంతో గ్యాస్ నుంచి విముక్తి ల‌భిస్తుంది.

3. మ‌హిళ‌లు నెల‌స‌రి స‌మ‌యంలో చిటికెడు ఇంగువ‌ను గ్లాస్ నీటిలో క‌లిపి తీసుకుంటే అధిక ర‌క్త‌స్రావం, నొప్పులు తగ్గుతాయి. అలాగే పురుషుల‌కు కూడా ఇంగువ దివ్యౌష‌ధంగా ప‌నిచేస్తుంది. ఇది పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచుతుంది. అందుకు గాను దీన్ని కొద్దిగా తీసుకుని నెయ్యిలో వేయించాలి. త‌రువాత అందులో కాస్తంత తేనె, ఒక టీస్పూన్ మ‌ర్రిచెట్టు జిగురు వేసి క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని రోజూ సూర్యోద‌యానికి ముందే 40 రోజుల పాటు తీసుకోవాలి. దీంతో న‌పుంస‌క‌త్వం స‌మ‌స్య త‌గ్గుతుంది.

4. కొద్దిగా ఇంగువ‌పొడిలో తేనె, అల్లం ర‌సం క‌లిపి సేవిస్తుంటే ద‌గ్గు, జ‌లుబు, ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ స‌మస్య‌లు వెంట‌నే త‌గ్గుతాయి. గొంతు, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన క‌ఫం బ‌య‌ట‌కు వ‌స్తుంది. దీర్ఘ‌కాలిక ద‌గ్గు నుంచి కూడా విముక్తి ల‌భిస్తుంది.

5. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి కూడా ఇంగువ చాలా మేలు చేస్తుంది. రెండు టీస్పూన్ల కాక‌ర‌కాయ ర‌సంలో పావు టీస్పూన్ ఇంగువ పొడిని క‌లిపి రోజూ ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి 30 నిమిషాల ముందు సేవించాలి. లేదా కాక‌ర‌కాయ కూర‌ల్లో ఇంగువ‌ను వేసి వండుకుని కూడా తిన‌వ‌చ్చు. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. మ‌ధుమేహం నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

6. హైబీపీ ఉన్న‌వారు రోజుకు ఒక్క‌సారి అర క‌ప్పు నీళ్ల‌లో కాస్తంత ఇంగువ‌ను క‌లిపి తీసుకుంటుండాలి. దీంతో హైబీపీ త‌గ్గుతుంది. మైగ్రేన్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

7. కాస్త ఇంగువ పొడి, నిమ్మ‌ర‌సంల‌ను తీసుకుని మెత్త‌ని ముద్ద‌గా బ‌ఠానీ గింజంత సైజులో చేయాలి. దాన్ని నొప్పి ఉన్న దంతం మీద లేదా చిగుళ్ల మీద పెట్టాలి. 2-3 గంట‌ల పాటు ఉన్నాక తీసేయాలి. ఇలా చేస్తుంటే దంతాల నొప్పి, చిగుళ్ల నుంచి ర‌క్త స్రావం కార‌డం.. వంటివి త‌గ్గిపోతాయి.

8. గాయాలు, పుండ్ల‌ను కూడా ఇంగువ మానేలా చేస్తుంది. కాస్త ఇంగువ పొడిలో నీళ్లు క‌లిపి పేస్ట్‌లా చేసి ఆ మిశ్ర‌మాన్ని రాస్తుంటే గాయాలు, పుండ్లు త్వ‌ర‌గా త‌గ్గుతాయి.

9. వైర‌ల్ జ్వరాల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించాలంటే ఇంగువ‌ను వాడుతుండాలి. ఇందులో యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. క‌నుక వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి.

గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లులు ఇంగువ‌ను వాడ‌రాదు. మిగిలిన‌వారు కూడా అధిక మొత్తాల్లో దీన్ని తీసుకోరాదు. స్వ‌ల్ప మోతాదులోనే తీసుకోవాలి.

Admin

Recent Posts