Categories: ఆహారం

ఆరోగ్యకరమైన టమాటా సూప్‌.. ఇలా తయారు చేయండి..!

టమాటాల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అందువల్ల వీటిని పోషకాల గని అని చెప్పవచ్చు. టమాటాలను నిత్యం తినడం వల్ల అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అయితే టమాటాలను నేరుగా తినలేని వారు వాటితో సూప్‌ తయారు చేసుకుని తాగవచ్చు. దీంతో రుచికి రుచి, పోషకాలకు పోషకాలు రెండూ లభిస్తాయి. టమాటా సూప్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

tomato soup recipe in telugu

టమాటా సూప్‌ తయారీకి కావల్సిన పదార్థాలు

* టమాటాలు – 8

* నీళ్లు – మూడున్నర కప్పులు

* మిరియాల పొడి – అర టీస్పూన్‌

* కారం – అర టీస్పూన్‌

* జీలకర్ర పొడి – అర టీస్పూన్‌

* అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – అర టీస్పూన్‌

* ఉప్పు – తగినంత

టమాటా సూప్‌ను తయారు చేసే విధానం

టమాటాలను శుభ్రంగా కడిగి రెండు విజిల్స్‌ వచ్చే వరకు కుక్కర్‌లో ఉడికించాలి. తరువాత వాటిని మిక్సీలో వేసి మెత్తంగా బ్లెండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమానికి నీటిని కలిపి స్టవ్‌ మీద పెట్టాలి. బాగా మరుగుతుండగా మిరియాల పొడి, కారం, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు వేసి బాగా కలపాలి. మంట తగ్గించి మరో 10 నిమిషాల పాటు మరిగించి దించాలి. పుదీనా చల్లుకుని వేడి వేడి సూప్‌ను తాగితే ఎంతో రుచికరంగా ఉంటుంది.

Share
Admin

Recent Posts