ఉల్లికాడలు.. వీటినే స్ప్రింగ్ ఆనియన్స్ అని ఇంగ్లిష్‌లో అంటారు. వీటితో సాధారణంగా కూరలు చేసుకుంటారు. లేదా కొత్తిమీర, కరివేపాకులా వీటిని కూరల్లో వేస్తుంటారు. అయితే ఉల్లికాడల వల్ల నిజానికి మనకు అనేక లాభాలు కలుగుతాయి. వీటితో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు.
* ఉల్లికాడలను చైనా, జపాన్‌లకు చెందిన ప్రజలు ఎక్కువగా సలాడ్స్, సూప్‌లలో వాడుతారు. సీఫుడ్‌లో వాడితే రుచి బాగుంటుంది. పైగా పోషకాలు కూడా లభిస్తాయి.
* ఉల్లిపాయల కన్నా ఉల్లికాడల్లోనే సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను, హైబీపీని తగ్గిస్తుంది.
* జలుబు, దగ్గుతో బాధపడేవారు ఉల్లికాడలతో సూప్‌ను తయారు చేసుకుని తాగితే ఆయా సమస్యల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
* ఉల్లికాడలను కట్ చేసి మిక్సీలో వేసుకుని రసం తయారు చేసుకోవాలి. దాన్ని 1 టీస్పూన్ మోతాదులో తీసుకుని అంతే మొత్తంలో తేనెతో కలిపి నిత్యం తాగుతుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* ఉల్లికాడల్లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది పెద్ద పేగుల్లోని సున్నితమైన పొరలను రక్షిస్తుంది. దీంతో పెద్ద పేగు దెబ్బ తినకుండా, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి.
* ఒక చిన్న బౌల్‌లో కొద్దిగా పెరుగు వేసి అందులో ఉల్లికాడ ముక్కలను వేసుకుని నిత్యం ఒకటి లేదా రెండు సార్లు తింటుంటే పైల్స్ సమస్య తగ్గుతుంది. పైల్స్ వల్ల వచ్చే వాపులు, నొప్పి తగ్గుతాయి.