ఈ పొడిని రోజూ తీసుకుంటే చాలు.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసి అవ‌త‌ల పడేస్తారు..

ప్ర‌స్తుత కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రినీ వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కంటి చూపు మంద‌గించ‌డం కూడా ఒక‌టి. పూర్వ‌కాలంలో వ‌య‌సు ఎక్కువ‌గా ఉన్న వారిలో మాత్ర‌మే ఈ స‌మ‌స్యను మ‌నం చూసే వాళ్లం. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో చిన్న పిల్ల‌లు కూడా క‌ళ్ల అద్దాల‌ను పెట్టుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉంటున్నాం. ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రు క‌ళ్ల‌ద్దాల‌ను పెట్టుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. రోజురోజుకూ క‌ళ్ల‌ద్దాల‌ను ఉప‌యోగించే వారి సంఖ్య పెరుగుతుందే త‌ప్ప త‌గ్గ‌డం లేదు.

కంటి చూపు మంద‌గించ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, కంటికి త‌గినంత విశ్రాంతిని ఇవ్వ‌క‌పోవ‌డం, టీవీ, సెల్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి వాటిని ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల కంటి చూపు మంద‌గిస్తోంది. అయితే ఓ ఇంటి చిట్కాను ఉప‌యోగించి క‌ళ్ల‌ద్దాలు వాడే ప‌ని లేకుండానే మ‌నం కంటి చూపును మెరుగుప‌రుచుకోవ‌చ్చు. కంటి చూపును మెరుగుప‌రిచే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

use this almonds powder mix daily for eye sight

ఈ చిట్కా కోసం మ‌నం బాదం ప‌ప్పును, సోంపు గింజ‌ల‌ను, ప‌టిక బెల్లాన్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఈ మూడింటిని కూడా స‌మ‌పాళ్ల‌లో వేరువేరుగా తీసుకోవాల్సి ఉంటుంది. బాదం ప‌ప్పును, సోంపు గింజ‌ల‌ను వేరువేరుగా క‌ళాయిలో వేసి దోర‌గా వేయించి ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ప‌టిక బెల్లాన్ని కూడా వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న పొడిని ఒక గాజుసీసాలో గాలి త‌గ‌లకుండా నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజూ రాత్రి ప‌డుకునే ముందు ఒక గ్లాస్ పాల‌లో ఒక టీ స్పూన్ మోతాదులో వేసుకుని క‌లిపి తాగాలి.

పెద్ద వ‌య‌సు ఉన్న వారు ఒక గ్లాస్ పాల‌లో రెండు టేబుల్ స్పూన్ల పొడిని వేసి క‌లిపి తాగాలి. అదే విధంగా కంటి చూపు మందంగించ‌డం అనే స‌మ‌స్య ఎక్కువ‌గా ఉన్న వారు ఈ చిట్కాను రోజుకు రెండు పూట‌లా పాటించాలి. స‌మ‌స్య త‌క్కువగా ఉన్న వారు ఒక పూట పాటిస్తే స‌రిపోతుంది. బాదంప‌ప్పు, సోంపు గింజ‌ల్లో ఉండే పోష‌కాలు కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల కంటి చూపుతోపాటు కంటి ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. ఈ చిట్కాను క్ర‌మం త‌ప్ప‌కుండా నెల రోజుల పాటు పాటించ‌డం వ‌ల్ల కళ్ల‌ద్దాలు వాడే అవ‌స‌రం లేనంత‌గా మ‌న కంటి చూపు మెరుగుప‌డుతుంది. ఈ చిట్కాను పాటించ‌డం మొద‌లు పెట్టిన 7 రోజుల్లోనే మ‌నం మార్పును గ‌మ‌నించ‌వ‌చ్చు. దీంతో క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

Share
D

Recent Posts