Wheat Laddu : గోధుమ లడ్డూలు ఎంతో ఆరోగ్య‌క‌రం.. రోజుకు ఒక‌టి తినాలి..!

Wheat Laddu : మ‌నం ఆహారంగా తీసుకునే ధాన్యాల్లో గోధుమ‌లు కూడా ఒక‌టి. గోధుమ‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. గోధుమ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉంటాయి. గోధుమ‌ల‌ను పిండిగా చేసి మ‌నం ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా ఈ గోధుమ పిండితో ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గోధుమ ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోధుమ పిండి – ఒక‌టిన్న‌ర క‌ప్పు, ఉప్పు – చిటికెడు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు ప‌లుకులు – కొద్దిగా, బాదం ప‌ప్పు ప‌లుకులు – కొద్దిగా, పిస్తా ప‌లుకులు – కొద్దిగా, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు – కొద్దిగా, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్, బెల్లం తురుము – ముప్పావు క‌ప్పు.

Wheat Laddu very healthy eat daily one
Wheat Laddu

గోధుమ ల‌డ్డూ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని, ఉప్పును, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోస్తూ మెత్త‌ని పిండి ముద్ద అయ్యేలా క‌లుపుకోవాలి. త‌రువాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి అంతా క‌లిసేలా మ‌రోసారి క‌లుపుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెపై మూతను ఉంచి 20 నిమిషాల పాటు పిండిని నాన‌బెట్టాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నెయ్యి వేసి నెయ్యి వేడ‌య్యాక డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించుకోవాలి. త‌రువాత చ‌పాతీ పిండిని మ‌రోసారి క‌లిపి కావ‌ల్సిన ప‌రిమాణంలో పిండిని తీసుకుంటూ చ‌పాతీల‌లా చేసుకోవాలి. ఈ చ‌పాతీని పెనం మీద వేసి నూనె వేస్తూ రెండు వైపులా కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇలా అన్ని చ‌పాతీల‌ను కాల్చుకున్న త‌రువాత వాటిని ముక్కలుగా చేసి ఒక జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత వీటిని మెత్త‌ని పొడి అయ్యేలా మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే జార్ లో బెల్లం తురుమును వేసి మెత్త‌గా పేస్ట్ లా అయ్యేలా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న బెల్లాన్ని కూడా చ‌పాతీ మిశ్ర‌మంలో వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ఇందులో ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ ను వేసి క‌లుపుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని కావ‌ల్సిన ప‌రిమాణంలో తీసుకుంటూ ల‌డ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ ల‌డ్డూలు త‌యార‌వుతాయి. ఈ ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ ల‌భిస్తాయి. రోజుకు ఒక‌టి లేదా రెండు గోధుమ ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇంట్లో త‌యారు చేసిన చ‌పాతీలు మిగిలిన‌ప్పుడు ఇలా ల‌డ్డూలుగా చేసుకుని తిన‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts