Banana : అర‌టి ప‌ళ్ల‌ను అతిగా తింటున్నారా..? అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Banana : మార్కెట్ లో మ‌న‌కు విరివిగా ల‌భించే పండ్ల‌లో అర‌టి పండు ఒక‌టి. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అందుబాటు ధ‌ర‌లో దొరుకుతుంది. మ‌న రోజూ వారీ ఆహారంలో వీలైనంత ఎక్కువ‌గా పండ్ల‌ను తీసుకోవాల‌నుకోవ‌డం మంచిదే. వాటిలో ఉండే ముఖ్య‌మైన‌ పోష‌కాలు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే అర‌టి పండు వ‌ల్ల తీవ్ర‌మైన ప్ర‌తికూల ప్ర‌భావాలు లేన‌ప్ప‌టికీ, దీనిని మోతాదుకు మించి తిన‌డం వ‌ల్ల కొన్ని సంద‌ర్భాల్లో ఆరోగ్యానికి హానికార‌కంగా మారే ప్ర‌మాదం ఉంటుంది.

ఇక అతిగా అర‌టి పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల‌న దానితో క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలకు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తాయి. ఒక వేళ మ‌నం అర‌టి పండ్ల‌ను తినాల‌నుకుంటే దాని వ‌ల‌న క‌లిగే ప్ర‌తికూల ప్ర‌భావాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌ల‌సి ఉంటుంది. అర‌టి పండ్ల‌ను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల మ‌లబ‌ద్ద‌కం స‌మ‌స్య క‌లుగుతుంది. మైగ్రేన్ కి కూడా దారి తీస్తుంది. అర‌టి పండ్ల‌లో ఉండే ఫ్ర‌క్టోజ్ ర‌క్తంలో చ‌క్కెర స్థాయుల‌ను ఉత్తేజ ప‌రుస్తుంది. అర‌టి పండు తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతారు. అర‌టిపండ్ల‌లో పొటాషియం పుష్క‌లంగా ఉంటుంది. అది ఎక్కువ‌గా తీసుకున్న‌ప్పుడు హైప‌ర్కెల్మియాకి దారి తీస్తుంది.

over consumption of Banana can lead to these health problems
Banana

అర‌టి పండ్ల‌లో అధికంగా ఉండే ఫైబ‌ర్ వ‌ల‌న పొట్ట‌లో గ్యాస్ తోపాటు ఉబ్బ‌రంగా అనిపిస్తుంది. ఇంకా అర‌టి పండ్ల‌ని ఎక్కువగా తిన్న‌ప్పుడు దంత క్ష‌యం కూడా క‌లుగుతుంది. అంతే కాకుండా న‌రాల వ్య‌వ‌స్థపై ప్ర‌భావం చూపి నిద్ర ఎక్కువ‌గా వ‌చ్చేలా చేస్తుంది. అయితే అర‌టి పండు ఆరోగ్యక‌ర‌మైన‌దే అయిన‌ప్ప‌టికీ ఏదైనా మోతాదుకు మించి తిన‌డం హానిక‌ర‌మే అని గుర్తుంచుకోవాలి. క‌నుక అర‌టి పండ్ల‌ను రోజుకు ఒక‌టి లేదా రెండు వ‌ర‌కు తిన‌వ‌చ్చు. అంత‌కు మించి తింటే మాత్రం దుష్ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. కాబ‌ట్టి ఈ పండ్ల‌ను తినే విష‌యంలో జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం మంచిది.

Share
Prathap

Recent Posts