Chicken Fry Masala : చికెన్ ఫ్రై మ‌సాలా.. ఇలా చేస్తే నోరూరిపోతుంది.. మొత్తం లాగించేస్తారు..

Chicken Fry Masala : ఆదివారం వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది చికెన్‌, మ‌ట‌న్, చేప‌లు వంటి మాంసాహారాల‌ను తింటుంటారు. త‌మ అభిరుచుల మేర‌కు వాటితో వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తుంటారు. అయితే చాలా మంది చికెన్ వంట‌కాలు అంటే ఇష్ట‌ప‌డ‌తారు. చికెన్‌తో చేసే వంట‌కాల్లో చికెన్ ఫ్రై మ‌సాలా కూడా ఒక‌టి. ఇది పొడి రూపంలో ఉండే వంట‌కం. దీన్ని ఎవ‌రైనా స‌రే సుల‌భంగా చేయ‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ ఫ్రై మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు..

చికెన్ – 1 కిలో, ప‌సుపు – 1 టీస్పూన్‌, నూనె – సరిప‌డా, పచ్చిమిర్చి – 4, కారం – 2 స్పూన్లు, నీళ్లు – స‌రిప‌డా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, ఉల్లిపాయలు – రెండు, గరం మసాలా – 1 టీస్పూన్‌.

Chicken Fry Masala make in this method very tasty
Chicken Fry Masala

చికెన్ ఫ్రై మ‌సాలాను త‌యారు చేసే విధానం..

ముందుగా కడాయిలో చికెన్‌ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్ళు వేసి 15 నిమిషాల పాటు స‌న్న‌ని మంట‌పై ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్ట‌వ్‌ ఆఫ్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్‌ తీసుకొని అందులో నూనె కొద్దిగా వేసి వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత ఉడికించిన చికెన్‌, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కారం వేసి పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. తర్వాత గరం మసాలా వేసి కలిపి రెండు నిమిషాల తర్వాత స్ట‌వ్‌ ఆఫ్‌ చేయాలి. అంతే ఎంతో రుచిక‌ర‌మైన చికెన్ ఫ్రై మ‌సాలా రెడీ అవుతుంది. దీన్ని అన్నంలో లేదా ఇత‌ర ఆహారాల‌తో క‌లిపి తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
Editor

Recent Posts