మూలిక‌లు

Ashwagandha Benefits : రోజూ ఒక స్పూన్ చాలు.. పురుషుల్లో ఆ శ‌క్తి పెరుగుతుంది.. ఇంకా ఎన్నో లాభాలు..!

Ashwagandha Benefits : అశ్వగంధ.. ఈ పేరును చాలా మంది వినే ఉంటారు. దీన్ని ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ మొక్కకు చెందిన వేర్లు, ఆకులు, పండ్లు, విత్తనాలు అన్నీ మనకు ఉపయోగపడతాయి. సాధారణంగా మనకు మార్కెట్‌లో అశ్వగంధ చూర్ణం లభిస్తుంది. దాన్ని ఆ మొక్క వేర్లను ఎండబెట్టి తయారు చేస్తారు. ఈ క్రమంలోనే అశ్వగంధ చూర్ణాన్ని నిత్యం తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అశ్వగంధ చూర్ణాన్ని రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. 1 లేదా 2 టీస్పూన్ల అశ్వగంధ చూర్ణాన్ని ఒక గ్లాస్ నీరు లేదా పాలలో కలిపి తీసుకోవచ్చు. లేదా నెయ్యి, తేనెలతోనూ దీన్ని తీసుకోవచ్చు. అశ్వగంథ పొడిని రోజూ సేవిస్తుంటే ఒత్తిడి, మానసిక ఆందోళన, డిప్రెషన్ తగ్గుతాయి. సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లోనూ ఈ విషయం వెల్లడైంది. మనస్సును ప్రశాంతంగా మార్చి ఆందోళనను తగ్గించే గుణాలు అశ్వగంధలో ఉంటాయి. అందువల్ల ఈ పొడిని నిత్యం తీసుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. మూడ్ మారుతుంది.

Ashwagandha Benefits men must take this

అశ్వగంధ పొడిని రోజూ తీసుకోవడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు నిద్రమాత్రలు మింగేకన్నా ఈ పొడిని తీసుకుంటే మేలు కలుగుతుంది. అశ్వగంధ పొడిని నిత్యం తీసుకోవడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అంగస్తంభన సమస్యలు పోతాయి. వీర్యం వృద్ధి చెందుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అశ్వగంధ పొడి వల్ల మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నిత్యం అశ్వగంధను తీసుకుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా అశ్వగంధ వల్ల ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ బాగా తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

అశ్వగంధలో ఉండే యాంటీ క్యాన్సర్ గుణాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపేస్తాయి. దీంతో క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అలాగే కండరాల వాపులు తగ్గుతాయి. శరీరానికి బలం చేకూరుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. అశ్వగంధ చూర్ణాన్ని రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంతో అధిక బరువు తగ్గుతారు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కనుకనే అశ్వగంధను కింగ్ ఆఫ్ ఆయర్వేద (ఆయుర్వేద రారాజు) అని కూడా పిలుస్తున్నారు.

Admin

Recent Posts