Aloe Vera Juice : అలొవెరా.. దీన్నే తెలుగులో కలబంద అని కూడా పిలుస్తారు. ఇది మనకు ఎక్కడ పడితే అక్కడ లభిస్తుంది. దీని ఆకులకు ముళ్లు ఉంటాయి. ఈ ఆకుల లోపల ఉండే గుజ్జును బయటకు తీసి దాంతో జ్యూస్ తయారు చేసి రోజూ తాగవచ్చు. ఈ జ్యూస్‌ను ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో తాగాలి. దీంతో అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. కలబంద జ్యూస్‌ను పరగడుపునే తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చాలా మందికి కడుపులో మంట, గ్యాస్ సమస్యలు ఉంటాయి. అలాగే అల్సర్లు కూడా ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. అలాంటి వారు రోజూ పరగడుపునే కలబంద జ్యూస్‌ను తాగితే ఫలితం ఉంటుంది. దెబ్బకు ఈ సమస్యలు తగ్గుతాయి. దీంతోపాటు అజీర్ణం, మలబద్దకం వంటి ఇతర జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. కలబంద జ్యూస్‌ను తాగితే జీర్ణవ్యవస్థ మొత్తం శుభ్రంగా మారుతుంది. ఆ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అనేక జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. కలబంద జ్యూస్ అద్భుతమైన డిటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తుంది. అందువల్ల దీన్ని తాగితే శరీరంతోపాటు లివర్ మొత్తం శుభ్రం అవుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు, శరీరంలోని వ్యర్థాలు బయటకుపోతాయి. దీని వల్ల లివర్ పనితీరు మెరుగు పడుతుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు.
3. కలబంద జ్యూస్‌ను నోట్లో కొద్దిగా పోసి పుక్కిలించవచ్చు. దీంతో నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు పోయి అవి ఆరోగ్యంగా మారుతాయి. దృఢంగా ఉంటాయి.
4. కలబంద జ్యూస్‌ను తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్ లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
5. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు రోజూ కలబంద జ్యూస్‌ను తాగితే బరువు తగ్గుతారు. అలాగే శిరోజాలకు ఉపయోగిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు నుంచి బయట పడవచ్చు. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.
6. కలబంద జ్యూస్‌ను తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు, సీజనల్ జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే గాయాలు, పుండ్లపై కలబంద గుజ్జును రాస్తే అవి త్వరగా మానిపోతాయి. గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. దీంతోపాటు ముఖంపై రాస్తే మొటిమలు, మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు రావు.
అయితే కలబంద అందరికీ పడదు. కొందరికి దీన్ని తీసుకున్నా.. రాసినా.. అలర్జీలు వస్తాయి. కనుక ముందుగా కాస్తంత గుజ్జు తీసుకుని చర్మంపై రాయాలి. ఎలాంటి దురద, దద్దుర్లు రాకపోతే అలాంటి వారు దీన్ని ఉపయోగించవచ్చు. అలా కాకుండా అలర్జీలు వస్తే.. దీన్ని ఉపయోగించరాదు. ఇక 12 ఏళ్ల లోపు వారు, గర్భిణీలు కలబందను తీసుకోరాదు. అలాగే విరేచనాలు అవుతున్నవారు, కడుపునొప్పి ఉన్నవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా దీన్ని తీసుకోరాదు. డాక్టర్ల పర్యవేక్షణలో కలబందను వాడుకోవచ్చు.