Anasuya Bharadwaj : టాలీవుడ్ రంగమ్మత్తగా పేరుగాంచిన అనసూయ ఏది చేసినా.. ఏ పోస్టు పెట్టినా.. అది వివాదాస్పదం అవుతుంటుంది. ఈ మధ్యే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈమె చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. మహిళలను అందరు మంగాళ్లు హింసిస్తారు.. అన్న కోణంలో ఆమె పెట్టిన పోస్టు రివర్స్ అయింది. దీంతో అనసూయపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మళ్లీ ఇంకో పోస్టుతో ఆమె మన ముందుకు వచ్చింది. తన ఫ్యాన్ పేజీల్లో తన గురించి పాజిటివ్ గా రాసే వారిని అభినందించింది. ఇక తాజాగా అనసూయ మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుతో సందడి చేస్తోంది. చేతితో పిజ్జా ముక్కలను పట్టుకుని వయ్యారంగా తింటూ కనువిందు చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
అనసూయ తాజాగా పిజ్జా తింటున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిల్లో అనసూయ ఎంతో క్యూట్‌గా కనిపిస్తుండడం విశేషం. అయితే గత ఫొటోలతో పోలిస్తే అనసూయ కాస్త లావు అయినట్లు కనిపిస్తుంది. దీంతో నెటిజన్లు ఈ విషయంపై ఎక్కువగా కామెంట్లు చేస్తున్నారు. అనసూయ నీ బుగ్గలు బర్గర్‌గా ఉన్నాయని.. ఒకరు కామెంట్ చేయగా.. నువ్వు లావు అవుతున్నావు, ఇలా పిజ్జాలు తింటే ఎలా.. కాస్త డైటింగ్ చేయి.. చూడలేకుండా ఉన్నాము.. అని చాలా మంది కామెంట్లు పెట్టారు. ఈ క్రమంలోనే అనసూయ పెట్టిన ఈ పోస్టు వైరల్ అవుతోంది. ఎంతో మంది ఈ ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. అనసూయ త్వరలోనే పుష్ప 2 షూటింగ్‌లో కీలకపాత్రలో నటించనుంది. ఈమె చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. ఈమె మళయాళం ఇండస్ట్రీలోనూ పరిచయం అవుతోంది.