Dry Amla : ప్రస్తుత కాలంలో 60 నుండి 70 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధులను పార్కిన్ సన్స్, అల్జీమర్స్, డిమెన్ షియా అనే ఈ మూడు రకాల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయి. తల, మెడ, చేతులు, శరీరమంతా వణకడం, కంటి చూపు తక్కువగాఉండడం, శరీరం నియంత్రణను కోల్పోవడం, శరీరం సహకరించకపోవడం, మెదడు నరాలు కుచించుకుపోయి మతిమరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వృద్ధులకు పెద్ద ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా నిరూపించబడిందని నిపుణులు చెబుతున్నారు. సంవత్సరం పొడవునా ఉసిరికాయలను తినాలన్న నియమాలను మన ఋషులు ఏనాడో మన ఆచారాల్లో భాగం చేసారు.
అయితే ఉసిరికాయలతో పచ్చడిని పెట్టుకుని సంవత్సరమంతా తింటున్నాం కానీ వాటిని ఇతర రూపాల్లో ఎక్కువగా తీసుకోవడమే మానేసాము. ఉసిరికాయలు ఎక్కువగా దొరికినప్పుడు వాటిని ముక్కలుగా చేసి ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. రోజూ ఉదయం, సాయంత్రం భోజనం తరువాత ఈ ఉసిరికాయ ముక్కలను నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇలా నిల్వ చేసుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా నానబెట్టుకుని తినవచ్చు. ఇలా ఉసిరికాయ ముక్కలను తినడం వల్ల నోట్లో చెడు బ్యాక్టీరియా మొత్తం నశిస్తుంది. అలాగే వృద్ధుల్లో వచ్చే ఈ మూడు రకాల మెదడుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో కూడా ఉసిరి కాయలు మనకు దోహదపడతాయి. ఈ ఉసిరికాయల్లో క్లోరోజెనిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్, ఎలాజిక్ యాసిడ్ లు ఎక్కువగా ఉంటాయి. మన శరీరాన్ని నియంత్రించడానికి మన మెదడు నిరంతరం పని చేస్తూ ఉంటుంది. మెదడు సక్రమంగా పని చేయాలంటే మెదడు కణాలు నిరంతరం పని చేస్తూ ఉండాలి.
ఈ మెదడు కణాలు పని చేసేటప్పుడు థ మరియు బీటా ఎమలాయిడ్ అనే హానికారక ప్రోటీన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రోటీన్లు మెదడు కణాలు కుచించుకుపోయి మెదడుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తేలా చేస్తాయి. మెదడు కణాల పనితీరును దెబ్బతీసే ఈ హానికారక ప్రోటీన్లను తగ్గించడంలో ఉసిరికాయలతో ఉండే ఈ మూడు రకాల యాసిడ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ యాసిడ్లు మెదడు కణాల పరిరక్షణలో ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు పరిశోధనల ద్వారా నిరూపించారు. కనుక ఉసిరికాయ లభించినప్పుడు దానిని తాజాగా వాడుకోవడం పెద్ద వయసు వారికి చాలా మంచిది. అలాగే ఉసిరికాయలను ముక్కలుగా చేసి ఎండబెట్టి సంవత్సరమంతా కూడా ఉపయోగించడం వల్ల వృద్ధులు చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.