Sweet Corn Payasam : స్వీట్ కార్న్‌తోనూ ఎంతో రుచిక‌ర‌మైన పాయ‌సం చేయ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Sweet Corn Payasam : మొక్క‌జొన్న‌ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో చేసే గారెలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని కాల్చుకుని లేదా ఉడ‌క‌బెట్టుకుని కూడా తింటారు. అయితే రెగ్యుల‌ర్ మొక్క‌జొన్న మ‌న‌కు సీజ‌న్‌లోనే ల‌భిస్తుంది. కానీ స్వీట్ కార్న్ అయితే ఎల్ల‌ప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే స్వీట్ కార్న్‌తోనూ మ‌నం ప‌లు వంట‌కాల‌ను చేసుకోవ‌చ్చు. అయితే స్వీట్ కార్న్‌తో ఎంతో రుచిక‌ర‌మైన పాయ‌సాన్ని కూడా చేయ‌వ‌చ్చు. దీన్ని చేయ‌డం కూడా సుల‌భ‌మే. అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్ర‌మంలోనే స్వీట్ కార్న్ పాయ‌సాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వీట్ కార్న్ పాయ‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స్వీట్ కార్న్ గింజ‌లు – 2 క‌ప్పులు, చిక్క‌ని పాలు – 4 క‌ప్పులు, నెయ్యి – పావు క‌ప్పు, చ‌క్కెర – అర క‌ప్పు, యాల‌కుల పొడి – 1 టీస్పూన్‌, పిస్తా, కిస్మిస్‌, జీడిప‌ప్పు, బాదం ప‌ప్పు – 2 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు – చిటికెడు.

Sweet Corn Payasam recipe in telugu make in this method
Sweet Corn Payasam

స్వీట్ కార్న్ పాయ‌సం త‌యారీ విధానం..

ముందుగా స్వీట్‌ కార్న్ ను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. వీటిలో రెండు టేబుల్ స్పూన్ల గింజ‌ల‌ను పక్కకు తీసి మిగతా కార్న్‌ను మిక్సీలో వేసి మెత్తగా ప‌ట్టుకోవాలి. త‌రువాత‌ ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి పిస్తా, బాదం, కిస్ మిస్, జీడిపప్పు, బాదం పప్పును వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. త‌రువాత ఒక బౌల్ తీసుకొని అందులో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కార్న్‌ మిశ్రమంతోపాటు 2 కప్పుల పాలు పోసి మిశ్రమాన్ని బాగా కలపాలి. స్టవ్‌ ఆన్‌ చేసి గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో ముందుగా విడిగా పెట్టిన కార్న్ గింజ‌ల‌ను వేసి వేయించాలి. బాగా వేగాక అందులో ముందు సిద్ధం చేసిన కార్న్ మిశ్ర‌మాన్ని వేయాలి.

ఆ మిశ్రమంలో మిగిలిన పాలు పోసి కుంకుమ పువ్వు వేసి చిన్న మంటపై కలియబెడుతూ ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత పంచదార, యాలకుల పొడి వేసి కలపాలి. దించే ముందు జీడిపప్పు, కిస్‌ మిస్, పిస్తా, బాదం ముక్కల్ని వేసి గార్నిష్ చేయాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేయాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన స్వీట్ కార్న్ పాయ‌సం రెడీ అవుతుంది. దీన్ని వేడిగా ఉన్న‌ప్పుడు తింటేనే బాగుంటుంది. అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు.

Editor

Recent Posts