Black Cumin : జీలకర్రను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే ఉపయోగిస్తున్నారు. ఇది ఎంతో కాలం నుంచి మనకు వంట ఇంటి దినుసుగా ఉంది. దీన్ని రోజూ కూరల్లో వేస్తుంటారు. అయితే జీలకర్రలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సాధారణ జీలకర్ర కాగా.. ఇంకోటి నల్ల జీలకర్ర. సాధారణ జీలకర్ర కన్నా నల్ల జీలకర్రలోనే అధికంగా పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. జీలకర్ర గింజలను కొద్దిగా తీసుకుని నీటిలో వేసి మరిగించి కషాయంలా తయారు చేసి ఎలాగైతే తాగుతారో.. నల్ల జీలకర్రతో కూడా అలాగే కషాయం చేసి రోజూ తాగవచ్చు. దీన్ని రోజూ పరగడుపునే ఒక కప్పు మోతాదులో తాగాల్సి ఉంటుంది. దీంతో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నల్ల జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. కణాలను రక్షిస్తాయి. క్యాన్సర్లు రాకుండా చూస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రావు. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. నల్ల జీలకర్రతో కషాయం చేసి రోజూ తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిపోతాయి. శరీరంలోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది. దీంతో బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హైబీపీ తగ్గుతుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
3. బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు నల్ల జీలకర్రతో కషాయం చేసి రోజూ తాగుతుంటే ఫలితం కనిపిస్తుంది. ఈ కషాయం తాగడం వల్ల షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
4. నల్ల జీలకర్రతో కషాయం చేసి తాగితే శరీంలోని వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
5. లివర్ సమస్యలు ఉన్నవారు ఈ కషాయం తాగితే త్వరగా కోలుకుంటారు. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్‌లో పేరుకుపోయిన వ్యర్థాలు అన్నీ బయటకు వచ్చేస్తాయి. లివర్ సరిగ్గా పనిచేస్తుంది.
6. జీర్ణాశయం లేదా పేగుల్లో అల్సర్లు ఉన్నవారు ఈ కషాయాన్ని తాగితే దెబ్బకు ఆ పుండ్లు తగ్గిపోతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్దకం నుంచి కూడా బయట పడవచ్చు.